Breaking News

2 వారాల్లో 3వ హత్య

Published on Wed, 12/31/2025 - 05:40

ఢాకా: మొహమ్మద్‌ యూనుస్‌ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వ ఏలుబడిలో హిందువులకు రక్షణ కరువైందన్న వాదనలకు మరింత బలం చేకూరేలా మరో హిందువు హత్యోదంతం తాజాగా వెలుగుచూసింది. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు మెమిన్‌సింగ్‌ జిల్లాలోని మెహ్రాబారీ ప్రాంతంలోని సుల్తానా స్వెట్టర్స్‌ లిమిటెడ్‌ వస్త్ర పరిశ్రమ వద్ద సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే 42 ఏళ్ల బజేంద్ర బిశ్వాస్‌ హత్యకు గురయ్యారు. తోటి సెక్యూరిటీ గార్డ్‌ అయిన 29 ఏళ్ల నోమన్‌ మియా తన సర్విస్‌ షాట్‌గన్‌తో కాలచ్చింపాడు. అయితే ఉద్దేశపూర్వకంగా అతడిని హత్యచేయలేదని మియా చెప్పారు.

‘‘పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ సరదాగా గన్‌ను బిశ్వాస్‌ వైపు గురిపెట్టా. వేలు పొరపాటున ట్రిగ్గర్‌కు తగిలి గన్‌ పేలింది. దీంతో బుల్లెట్‌ గాయంతో అతడు కూలబడితే వెంటనే భలూకా ఉపజిల్లా ఆస్పత్రిలో చేర్పించాం’’అని మియా వివరించారు. అయితే విషయం తెల్సి పోలీసులు వెంటనే మియాను అరెస్ట్‌చేశారు. ఉద్దేశపూర్వకంగానే హత్యచేశాడని విపక్ష పార్టీలు, హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. షేక్‌ హసీనా ప్రధాని పదవి కోల్పోయి దేశాన్ని వీడాక బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు ఎక్కువయ్యాయి. దైవదూషణ ఆరోపణలపై డిసెంబర్‌ 18న ఫ్యాక్టరీ కార్మికుడైన హిందువు దీపూ చంద్రదాస్‌ను స్థానికులు కొట్టిచంపారు. బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ అమృత్‌ మొండల్‌ అనే మరో హిందువునూ చంపేశారు.

#

Tags : 1

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)