Breaking News

Bangladesh: ఆగని మత హింస: మరో యువకుని హత్య

Published on Thu, 12/25/2025 - 19:54

ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల పరిస్థితి అంతకంతకూ ఆందోళనకరంగా మారుతోంది. మైమెన్‌సింగ్‌లో దీపు చంద్ర దాస్ అనే  యువకుడిని హత్యచేసి.. మృతదేహాన్ని దహనం చేసిన ఘటన మరువక ముందే.. తాజాగా రాజ్‌బారి జిల్లాలో మరో హిందూ యువకుడు మూకదాడికి బలయ్యాడు. బుధవారం రాత్రి పాంగ్షా ఉపజిల్లా హోసైన్‌డంగా పాత మార్కెట్ వద్ద 29 ఏళ్ల అమృత్ మండల్ (సామ్రాట్) అనే యువకుడిని కొందరు కొట్టి చంపడం తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం.. అమృత్ మండల్ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో స్థానికులు అతడిపై దాడి చేసి, హత్య చేశారు. మృతుడు ‘సామ్రాట్ బహినీ’ అనే స్థానిక బృందానికి నాయకుడని పాంగ్షా పోలీస్ స్టేషన్ అధికారి షేక్ మొయినుల్ ఇస్లాం తెలిపారు. దర్యాప్తు ప్రారంభించిన అధికారులు, అల్లర్లు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు. వారం రోజుల వ్యవధిలో ఇది రెండో మూకహత్య కావడం గమనార్హం. డిసెంబర్ 18న మైమెన్‌సింగ్‌లోని భలుకాలో దీపు చంద్ర దాస్ అనే ఫ్యాక్టరీ కార్మికుడిని ఇస్లాం మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే నెపంతో కొట్టి చంపారు.  మరోవైపు, దేశంలో రాజకీయ ఉద్రిక్తతలు  పతాక స్థాయికి చేరాయి. విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య తర్వాత ఢాకాలో హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. కొందరు యువ నేతలు భారత వ్యతిరేక ప్రకటనలు చేయడంతో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)