Breaking News

బిష్ణోయ్ గ్యాంగ్‌కు టెర్రర్ ట్యాగ్?.. కెనడాలో పెరుగుతున్న ఒత్తిడి

Published on Wed, 07/16/2025 - 09:40

ఒట్టావా: కెనడాతో సహా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్..హింస, దోపిడీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు, పలు హత్యలకు పాల్పడుతున్నదని కెనడియన్‌ నేత డేనియల్ స్మిత్ పేర్కొన్నారు. ఈ గ్యాంగ్‌ అంతర్జాతీయ నేర నెట్‌వర్క్ కలిగివున్నదని, అందుకే ఈ గ్యాంగ్‌కు టెర్రర్‌ ట్యాగ్‌ ఇవ్వాలని ఆయన ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో కోరారు.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యం నేరపూరితమైనదని, హింసాత్మకమైనదని స్మిత్  ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ ముఠా కార్యకలాపాలకు ఎటువంటి హద్దులు లేవని, దీనికి దేశంలో స్థానం ఉండకూడదని అన్నారు. బిష్ణోయ్ ముఠాను ఉగ్రవాద సంస్థగా అధికారికంగా గుర్తించడం ద్వారా, దాని ఆటలు ఇకపై సాగవని , ప్రాంతీయ  స్థాయి చట్ట అమలు సంస్థల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడదని స్మిత్‌ పేర్కొన్నారు. కాగా బిష్ణోయ్ నెట్‌వర్క్‌లో కీలకంగా భావిస్తున్న గోల్డీ బ్రార్‌పై చర్యలు తీసుకోవాలని భారత్‌ ఎప్పటినుంచో కెనడాను కోరుతూ వస్తోంది.
 

గత జూన్‌లో బ్రిటిష్ కొలంబియా నేత డేవిడ్ ఎబీ  కెనడాకు ఇదేవిధమైన అభ్యర్థన చేశారు. ఈ ముఠా అల్బెర్టా, ఒంటారియో ప్రాంతంలోని దక్షిణాసియా ప్రజలపై పలు నేరాలకు పాల్పడిందని డేవిడ్ ఎబీ ఆరోపించారు. ఇదే సమయంలో సర్రే మేయర్ బ్రెండా లాక్ ఈ పిలుపుకు మద్దతునిచ్చారు. బిష్ణోయ్ ముఠాను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తే, కెనడియన్ చట్ట అమలు సంస్థలకు వ్యవస్థీకృత నేర నెట్‌వర్క్‌లతో పోరాడేందుకు అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు