‘ఆ జంతువుపై భారీ మూల్యం’: ట్రంప్‌

Published on Thu, 11/27/2025 - 08:49

వాషింగ్టన్‌ డీసీ: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో  ఇద్దరు వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ సభ్యులపై జరిగిన  కాల్పుల సంఘటనపై  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని ఉద్దేశిస్తూ తన ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో చేశారు. దానిలో ట్రంప్‌ ఆ నిందితుడిని జంతువుతో పోల్చారు. అతను భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. గాయపడిన గార్డులను చికిత్స కోసం రెండు వేర్వేరు ఆసుపత్రులకు తరలించనట్లు తెలిపారు​. ఈ ఘటన దరిమిలా ట్రంప్‌  నగరానికి అదనంగా 500 మంది నేషనల్ గార్డ్ సభ్యులను మోహరించాలని ఆదేశించారు.
 

ట్రంప్‌తో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఈ దాడిపై విచారం వ్యక్తం చేశారు. వాన్స్.. ఆ గార్డులను ధైర్యస్థులు అని కొనియాడగా , ఒబామా ‘అమెరికాలో హింసకు స్థానం లేదు’ అని వ్యాఖ్యానించారు. బాధిత సైనికులు, వారి కుటుంబాల కోసం తాను, మిచెల్ ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఈ దాడి వెనుక ఉన్న అనుమానితుడి వివరాలు వెల్లడయ్యాయి. చట్ట అమలు అధికారులు అందించిన సమాచారం ప్రకారం, కాల్పులు జరిపిన వ్యక్తిని 29 ఏళ్ల ఆఫ్ఘన్ జాతీయుడు రహ్మానుల్లా లకాన్వాల్‌గా గుర్తించారు. ఎన్‌వై పోస్ట్‌ నివేదిక ప్రకారం లకాన్వాల్ 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుండి సైనిక ఉపసంహరణ సమయంలో అమెరికాకు వచ్చాడు. అనుమానితుడు కూడా కాల్పుల్లో గాయపడ్డాడు. అయితే అతనికి ప్రాణాపాయం లేదని చట్ట అమలు అధికారి తెలిపారు.

ఈ కాల్పులు బుధవారం మధ్యాహ్నం 2:15 గంటలకు జరిగాయి. దాడి చేసిన వ్యక్తి ముందుగా ఒక మహిళా గార్డుపై కాల్పులు జరిపాడు. అనంతరం కాల్పులతో మరో గార్డును కూడా గాయపరిచాడు. అయితే సమీపంలో ఉన్న మూడవ గార్డు వెంటనే స్పందించి, కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు గార్డులు తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితిపై మొదట్లో గందరగోళం నెలకొంది. వెస్ట్ వర్జీనియా గవర్నర్ పాట్రిక్ మోరిస్సే  ఆ ఇద్దరు గార్డులు మరణించారని ప్రకటించిన కొద్దిసేపటికే ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. గాయపడిన ఈ ఇద్దరు యూఎస్‌ గార్డ్‌మెన్లు, నేరాలను అరికట్టే మిషన్‌లో భాగంగా మోహరించిన 2,000 మందికి పైగా సైనికులలో సభ్యులు. ఈ దాడి నేషనల్ గార్డ్ దళాల భద్రత, వారి విధి నిర్వహణలో సవాళ్లను మరోసారి  ఎత్తిచూపింది. 

ఇది కూడా చదవండి: అమెరికాలో కాల్పుల మోత

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)