Breaking News

టెన్షన్‌..టెన్షన్‌: హాట్‌లైన్‌పై రష్యా సంచలన ప్రకటన

Published on Wed, 11/20/2024 - 16:14

మాస్కో:అమెరికా-రష్యా మధ్య అత్యవసర కమ్యూనికేషన్‌కు కీలకమైన హాట్‌లైన్‌ వ్యవస్థ ఇప్పుడు అందుబాటులో లేదని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌  వెల్లడించారు. అమెరికా,రష్యాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తితే రెండు దేశాల  అధ్యక్షులు చర్చించేందుకు ఓ సురక్షితమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థ ఉందని,ఇది వీడియో కూడా ప్రసారం చేయగలదని పెస్కోవ్‌ గతంలో చెప్పారు.

అయితే ప్రస్తుతం ఇది వినియోగంలో లేదని తాజాగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు పెస్కోవ్‌ సమాధానమిచ్చారు. కాగా,రష్యాపై అమెరికా తయారీ లాంగ్‌రేంజ్‌ మిసైల్స్‌ వాడేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అనుమతివ్వడంతో యూరప్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి.

దీనికి ప్రతిగా అణ్వాయుధాల ప్రయోగంపై నిబంధనలను రష్యా సరళతరం చేసింది.ఈ పరిణామాల నడుమ మంగళవారం(నవంబర్‌ 19) కీవ్‌ దళాలు రష్యా ప్రధాన భూభాగంపై క్షిపణులతో దాడులు చేశాయి.ఇందుకు ప్రతీకారంగా ఉక్రెయిన్‌పై మాస్కో దళాలు దాడి చేయవచ్చనే భయాలు పెరిగిపోయాయి. దీంతో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని తన దౌత్య కార్యాలయాన్ని అమెరికా ఖాళీ చేసింది.ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా,రష్యా మధ్య హాట్‌లైన్‌ వాడకంలో లేదన్న వార్త మరింత భయాందోళనలకు కారణమవుతోంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)