Breaking News

America: మరోమారు కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి

Published on Sun, 03/23/2025 - 11:13

లాస్ క్రూసెస్: అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం రేపాయి. తాజాగా న్యూ మెక్సికో(New Mexico)లోని లాస్ క్రూసెస్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  ఒక పార్కులో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు  మృతిచెందారు. 15 మంది గాయపడ్డారు. ఈ  ఉదంతానికి సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు.

శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందగానే పోలీసులు(Police) ఘటన జరిగిన యంగ్ పార్కుకు చేరుకున్నారు. పార్కులో ఒక కార్ షో జరిగింది. దానికి  దాదాపు 200 హాజరయ్యారు. కాగా ఈ కార్ షోకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. లాస్ క్రూసెస్ పోలీస్ చీఫ్ జెరెమీ స్టోరీ మీడియాతో మాట్లాడుతూ పార్క్‌లో చెల్లాచెదురుగా 50 నుండి 60 షెల్ కేసింగ్‌లు కనిపించాయని,  దీనిని చూస్తుంటే, చాలామంది తుపాకీలతో కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నదన్నారు.

పార్కులో రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగివుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనలో ముగ్గురు మృతిచెందారు. 15 మంది గాయపడ్డారు. మృతులంతా టీనేజర్లు(Teenagers). మృతులు, గాయపడిన వారి పేర్లను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఈ ఘటనలో గాయపడినవారిని  ఆస్పత్రులకు తరలించినట్లు లాస్ క్రూసెస్ అగ్నిమాపక విభాగం చీఫ్ మైఖేల్ డేనియల్స్ తెలిపారు. లాస్ క్రూసెస్ నగర కౌన్సిలర్ జోహన్నా బెంకోమో, మేయర్ ప్రో టెం జోహన్నా బెంకోమో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ చేస్తూ, ఈ సంఘటనపై విచారాన్ని వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: దక్షిణ కొరియాలో బూడిదవుతున్న 20 అడవులు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)