Breaking News

‘పాక్‌పై భారత్‌ దాడి చేస్తే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తాం’

Published on Sat, 05/03/2025 - 07:07

ఢాకా/న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్‌పై భారత్‌ దాడి చేసిన పక్షంలో చైనా సాయంతో ఏడు ఈశాన్య రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంటామని బంగ్లాదేశ్‌ తాత్కాలిక అధ్యక్షుడు యూనుస్‌ సలహాదారు ఏఎల్‌ఎం ఫజ్రుల్‌ రెహ్మన్‌ బెదిరింపులకు దిగారు. ఈ మేరకు ఆయన తన ఫేస్‌బుక్‌ ఖాతాలో మంగళవారం బెంగాలీలో రాసుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఈ సందర్భంగా ఏఎల్‌ఎం ఫజ్రుల్‌ రెహ్మన్‌..‘భారత ఈశాన్య రాష్ట్రాల ఆక్రమణకు సంయుక్త సైనిక ఏర్పాట్ల కోసం చైనాతో చర్చలు జరపాల్సిన అవసరం చాలా ఉందని అందులో సూచించారు. ఇక, బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహ్మద్‌ యూనస్‌కు రహ్మాన్‌ అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. అయితే, ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని విదేశాంగ శాఖ తెలిపింది. ఇటువంటి వాటిని తాము ప్రోత్సహించం, బలపరచం అని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను ప్రభుత్వంతో ముడిపెట్టవద్దని కూడా కోరింది. పొరుగుదేశాలతో శాంతియుత సంబంధాలను కొనసాగించాలన్నదే తమ అభిమతమని వివరించింది.

ఇదిలా ఉండగా.. భారత్‌ విషయంలో పాకిస్తాన్‌ మరో స్టాండ్‌ తీసుకున్న‍ట్టు సమాచారం. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్‌ ప్రకటించడాన్ని నిరసిస్తూ ఢిల్లీకి లాంఛనంగా దౌత్య నోటీసు ఇవ్వాలని పాకిస్తాన్‌ యోచిస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌ప్రెస్‌ న్యూస్‌ వార్తా కథనం వెల్లడించింది. పాక్‌ విదేశీ, న్యాయ, జలవనరుల మంత్రిత్వశాఖల మధ్య జరిగిన ప్రాథమిక చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది.

 

 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)