Breaking News

పాక్‌ జైలులో భారత యువకుడు విలవిల.. ప్రేమే కారణం

Published on Sat, 01/25/2025 - 13:01

‘నాన్నా.. ఆ అమ్మాయి నాకోసం ఎంతగానో పరితపిస్తోంది... అందుకే నేను పాకిస్తాన్ వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇస్లాంను స్వీకరించాను. నేను ఇంటికి తిరిగి వస్తానో లేదో నాకే తెలియదు. దయచేసి నా కోసం చింతించకండి’..  ఇవి యూపీలోని అలీఘర్‌కు చెందిన బాదల్ బాబు అనే యువకుడు వీడియో కాల్‌లో తన తండ్రితో పలికిన మాటలు.

సోషల్ మీడియా వేదికగా ఓ అమ్మాయిని ప్రేమించి, సరిహద్దులు దాటి, శత్రు దేశానికి చేరుకున్న ఓ యువకుడు వీడియో కాల్‌లో తన తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం పాక్‌ పోలీసులు అతనిని కోర్టులో హాజరుపరిచారు. అక్కడ అతనికి బెయిల్ లభించలేదు. పాక్‌ యువతి ప్రేమలో పడిన భారతీయ యువకుడు ఇప్పుడు ఆ దేశంలో పడరానిపాట్లు పడుతున్నాడు.

అలీఘర్‌కు చెందిన బాదల్ బాబు 2024 అక్టోబర్‌లో అక్రమంగా సరిహద్దులు దాటి పాక్‌ చేరుకున్నాడు. తరువాత జరిగిన పరిణామాలతో డిసెంబర్‌ నుంచి జైలులోనే ఉన్నాడు. జనవరి 24న బాదల్ బాబును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. చార్జిషీట్ అందకపోవడంతో అతని బెయిల్ పిటిషన్ విచారణకు రాలేదు. దీంతో తిరిగి అతడిని జైలుకు తరలించారు. ఈ కేసు తరుపరి విచారణ ఫిబ్రవరిలో ఉండనుంది.

బాదల్ తండ్రి కృపాల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాను వీడియో కాల్‌లో న్యాయవాది ఫయాజ్‌తో మాట్లాడినట్లు భావోద్వేగానికి గురవుతూ తెలిపారు. పాకిస్తాన్ నివాసి సనా రాణి, ఆమె తల్లి ఆహ్వానించడంతోనే తన కుమారుడు పాకిస్తాన్ వెళ్లి , అక్కడ చిక్కుకుపోయాడని కృపాల్  ఆవేదన వ్యక్తం చేశారు. సనాను కలుసుకునేందుకు బాదల్ పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని మండి బహావుద్దీన్ జిల్లాలోని మాంగ్ గ్రామానికి చేరుకున్నాడు.

అయితే సనా అతనిని వివాహం చేసుకునేందుకు నిరాకరించింది. కాగా బాదల్ బాబు వీసా, పాస్‌పోర్ట్ లేకుండా అక్రమంగా పాకిస్తాన్‌కు చేరుకున్నాడు. దీంతో పాక్‌ పోలీసులు అతనిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. మీడియా దగ్గరున్న వివరాల ప్రకారం బాదల్ బాబు యూపీలోని అలీఘర్‌లోని నాగ్లా ఖట్కారి గ్రామ నివాసి. అతనికి ఫేస్‌బుక్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఒక యువతితో స్నేహం ఏర్పడింది. వారిద్దరూ రోజూ చాటింగ్ ద్వారా మాట్లాడుకునేవారు. ఈ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది.

బాదల్ బాబు 2024 అక్టోబర్‌లో పాకిస్తాన్ చేరుకున్నాడు. తన గుర్తింపును మార్చుకుని అక్కడే ఉన్నాడు. అయితే గత డిసెంబర్‌లో స్థానికులకు అనుమానం వచ్చి బాదల్ బాబు గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అతనిని బహావుద్దీన్ నగరంలో అరెస్టు చేసి, తరువాత కోర్టులో హాజరుపరిచి, జైలుకు పంపారు. విచారణలో బాదల్ బాబు తన నేరాన్ని అంగీకరించాడు. తాను గతంలో రెండుసార్లు సరిహద్దులు దాటడానికి ప్రయత్నించానని,  మూడోసారి విజయం సాధించానని బాదల్ బాబు తెలిపాడు.

ఇది కూడా చదవండి: Mahakumbh: మౌని అమావాస్యకు ఎందుకంత ప్రత్యేకత?

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)