Breaking News

‘సరిహద్దులు’ దాటిన మరో ప్రేమకథ.. నూతన సంవత్సరంలో ఏమవునో..

Published on Wed, 01/01/2025 - 08:06

ప్రేమ గుడ్డిదని, అది చిగురించినప్పుడు సరిహద్దులు కనిపించవని అంటారు. ఇది ‘బాబు’ ప్రేమకథతో మరోమారు నిజమని తేలింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన బాబు తాను ప్రేమించిన పాక్‌ యువతి కోసం సరిహద్దులు దాటి, తన ప్రాణాలనే పణంగా పెట్టాడు.

బాబు సోషల్ మీడియా(Social media)లో చూసి, ఒక పాక్‌ యువతిని ప్రేమించాడు. తొలి చూపులోనే ‍ప్రేమలో పడిన బాబు ఆ యువతి కోసం వీసా, పాస్‌పోర్టు లేకుండా దేశ సరిహద్దులు దాటేశాడు. ప్రస్తుతం బాబు పాకిస్తాన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆ ప్రేమికుని అసలు పేరు బాదల్‌, అయితే బాబు అని ముద్దుగా ఇంట్లోనివారు పిలుస్తుంటారు. ఇప్పుడు అతని కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బాబును సురక్షితంగా భారత్‌ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని వారు అభ్యర్థిస్తున్నారు.

అలీగఢ్ జిల్లా బార్లా పోలీస్ స్టేషన్(Police station) పరిధిలోని నాగ్లా ఖిత్కారీ గ్రామానికి చెందిన బాదల్ అలియాస్ బాబు(30) సోషల్ మీడియాలో చూసి, ఒక పాక్‌ యువతి ప్రేమలో పడ్డాడు. ఈ ప్రేమలో బాబు ఎంతగా మునిగిపోయాడంటే.. వెంటనే ఇంటిని వదిలి పాకిస్తాన్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. సరైన వీసా, పత్రాలు లేకుండా సరిహద్దులు దాటాడు. పాకిస్తాన్‌లోని మోజా మోంగ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన బాబును పాక్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన 2024, డిసెంబర్ 27న జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ పోలీసుల విచారణలో బాదల్ తాను సోషల్ మీడియా ద్వారా పాకిస్తానీ యువతి ప్రేమలో పడ్డానని, ఆమెను కలిసేందుకే పాకిస్తాన్ వచ్చానని చెప్పాడని సమాచారం.

బాదల్ ఢిల్లీలోని గార్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కుటుంబంలోని ముగ్గురు సోదరులలో అతను రెండవవాడు. బాబు ఓ పాకిస్తానీ యువతితో ఫేస్‌బుక్‌లో చాట్‌ చేస్తుంటాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీపావళికి ముందు బాబు ఇంటికి వచ్చాడని, తిరిగి ఢిల్లీకి వెళ్లే ముందు తన గుర్తింపు కార్డు(Identity card), ఇతర పత్రాలను ఇంట్లో పెట్టి వెళ్లాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పటి నుంచి బాబుకు సంబంధించిన సరైన సమచారం అందలేదన్నారు.

మీడియాకు అందిన వివరాల ప్రకారం పాకిస్తాన్ పోలీసులు.. బాబును వీసా, ఇతర పత్రాలు అడిగినప్పుడు, అతను ఏమీ చూపించలేదు. దీంతో అతను పాకిస్తాన్ ఫారినర్స్ యాక్ట్, 1946 సెక్షన్ 13, 14 కింద అరెస్టయ్యాడు.  కాగా బాబు గతంలో రెండుసార్లు భారత్-పాక్‌ సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించాడని, అయితే అతని ప్రయత్నం సఫలం కాలేదని పాక్ పోలీసులు చెబుతున్నారు.

బహౌద్దీన్ ప్రాంతంలో పట్టుబడిన బాబును అక్కడి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అక్కడ అతనికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. బాబు పాక్‌లోకి ప్రవేశించడం ప్రేమ కోసమేనా లేదా మరేదైనా ఉద్దేశ్యం ఉందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ నుంచి కానీ, భారత రాయబార కార్యాలయం నుంచి కానీ  ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. ఈ నూతన సంవత్సరంలోనైనా తమ బాబు తమ ఇంటికి వస్తాడని అతని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఆలయాల్లో నూతన సంవత్సర సందడి

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)