Breaking News

Alexei Navalny: నావల్నీ తల, ఒంటిపై కమిలిన గాయాలు

Published on Mon, 02/19/2024 - 14:06

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిపై అంతర్జాతీయ స్థాయిలో ఖండనలు వ్యక్తం అవుతున్నాయి. పుతిన్‌ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించారు గనుకే ఆయన్ని.. తీవ్రవాదం కేసులో జైలుకు పంపారని.. అక్కడే ఆయన్ని చంపేసి ఉంటారని అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు.  అయితే.. ఆయన్ను హింసించారంటూ వస్తోన్న వార్తలను రష్యా ప్రభుత్వం ఖండించింది. సహజ కారణాల వల్లే చనిపోయారని చెబుతోంది. ఈ క్రమంలో.. 

ఓ కథనం వెలుగులోకి వచ్చింది. నావల్నీ తల, ఛాతీపై కమిలిన గాయాలున్నాయని స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. మృతదేహం మార్చురీకి తరలించినప్పుడు ఈ గాయాలు కనిపించాయని వైద్య నిపుణుడిని ఉటంకిస్తూ తెలిపింది. ‘‘సాధారణంగా జైల్లో చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను గ్లాజ్కోవా వీధిలోని బ్యూరో ఆఫ్ ఫోరెన్సిక్‌ మెడిసిన్‌కు తరలిస్తారు. ఈ కేసులో కొన్ని కారణాలతో బాడీని క్లినికల్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. తర్వాత మార్చురీ లోపలికి తీసుకువచ్చారు. అక్కడ ఇద్దరు పోలీసుల్ని కాపలా ఉంచారు. ప్రతిఒక్కరూ ఆయన మృతికి గల కారణం తెలుసు కోవాలనుకుంటున్నారు. ఈ గోప్యత దేనికి, వారు ఏదైనా దాచాలనుకుంటున్నారా..?’ అని ఆ వైద్యుడు ప్రశ్నించినట్లు ఆ కథనం పేర్కొంది.

ఇదిలా ఉంటే.. సడెన్‌ డెత్‌ సిండ్రోమ్‌ వల్లే అలెక్సీ నావల్నీ చనిపోయినట్లు అధికారులు తనకు సమాచారం అందించారని ఆయన తల్లి లియుడ్మిలాకు మీడియాకు చెప్పారు. అదే సమయంలో.. మృతదేహాన్ని ఇప్పటికీ కుటుంబానికి అప్పగించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నావల్నీకి నివాళులర్పించేవారిని, ర్యాలీలు నిర్వహించేవారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)