Breaking News

బర్త్‌డే వేడుకల్లో బెలూన్స్‌ వాడుతున్నారా?.. ఇది తెలుసుకోండి..

Published on Wed, 10/11/2023 - 07:59

టెన్నెస్సీ: పుట్టిన రోజు వేడుకలే ఆ చిన్నారి పాలిట శాపమయ్యాయి. అందంగా అలంకరించిన బెలూనే చివరికి ఆ చిన్నారి ఉసురుతీసింది. దీంతో, వేడుకలు జరుగుతున్న ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. అందుకే, ప్రమాదకరమైన వాయువులతో నింపిన బెలూన్లతో ఆటలొద్దు.. జాగ్రత్త..! అంటూ చిన్నారి తల్లి హెచ్చరిస్తున్నారు.

వివరాల ప్రకారం.. అమెరికాలోని టెన్నెస్సీలో ఇటీవల చోటు చేసుకున్న విషాద ఘటన ఇది. అలెగ్జాండ్రా కెల్లీ అనే ఏడేళ్ల చిన్నారి సెప్టెంబర్‌ 24వ తేదీన ఏడో పుట్టిన రోజు జరుపుకుంది. బర్త్‌డే వేడుకలో ఆమె తల్లి చన్నా కెల్లీ ఏడంకెతో కూడిన పెద్ద బెలూన్‌తోపాటు మరో 10 రబ్బర్‌ బెలూన్లను అలంకరించారు. అక్టోబర్‌ ఒకటో తేదీన ఆదివారం నాడు బెలూన్లుంచిన గదిలోకి వెళ్లి ఆడుకుంటోంది. ఈ క్రమంలో సదరు చిన్నారిని ఇంటి సభ్యులు పట్టించుకోలేదు.

అయితే, కొద్దిసేపటి తర్వాత వెళ్లి చూడగా గదిలో అలెగ్జాండ్రా పెద్ద బెలూన్‌పై ఉలుకూపలుకూ లేకుండా పడిపోయి ఉంది. వెంటనే కృత్రిమ శ్వాస(సీపీఆర్‌) కల్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బెలూన్‌లోని ప్రమాదకరమైన హీలియం వాయువును పీల్చడం వల్లే ఆమె శ్వాస ఆగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. చిన్నారి తల్లి చన్నా కెల్లీ ఈ విషాద వార్తను సోషల్‌మీడియాలో పంచుకోవడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది. బెలూన్ల వాడకం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులను ఆమె హెచ్చరించారు. 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)