Breaking News

అల్‌ఖైదా కంటే ప్రమాదకరం

Published on Sun, 10/15/2023 - 06:14

వాషింగ్టన్‌: పాత మసీదులు, యూదుల పురాతన ఆలయాల ఆనవాళ్లు ఉన్న పవిత్ర ప్రాంతాలపై పట్టు కోసం మొదలైన పాలస్తీనా–ఇజ్రాయెల్‌ యుద్ధం పలు మలుపులు తీసుకుంటున్న వేళ హమాస్‌ సాయుధసంస్థపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. అమెరికాలోని ఫిలడెలి్ఫయాలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బైడెన్‌ మాట్లాడారు. 2001 సంవత్సరంలో 9/11 సెపె్టంబర్‌ దాడులకు తెగబడిన అల్‌ఖైదా ఉగ్రసంస్థ కంటే హమాస్‌ ప్రమాదకరమైనదని అభివరి్ణంచారు.

హమాస్‌ దాడులకు గురైన ఇజ్రాయెల్‌కు అమెరికా ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. ‘ ఇజ్రాయెల్‌పై దాడి చేసి హమాస్‌ ఏకంగా వేయి మందికిపైగా అమాయకులను పొట్టనబెట్టుకుంది. అల్‌ఖైదా సృష్టించిన 9/11 దాడులకంటే ఈ దాడి అత్యంత దారుణం. అల్‌ఖైదా కంటే హమాస్‌ ప్రమాదకరం. అల్‌ఖైదాను మించిన దుషు్టలు వీరు. మొదట్నుంచీ చెబుతున్నట్లే మేం ఇజ్రాయెల్‌కు బాసటగా నిలబడతాం. ఆత్మరక్షణ కోసం, ప్రతిదాడుల కోసం ఇజ్రాయెల్‌ తీసుకునే ప్రతి నిర్ణయానికి, ప్రతీ చర్యకూ అమెరికా అండగా ఉంటుంది. గాజాలో నెలకొన్న మానవీయ సంక్షోభానికి తక్షణం ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. ఇందుకోసమే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ఇప్పటికే ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు’ అని బైడెన్‌ చెప్పారు.

ఐరాసతోనూ చర్చిస్తున్నాం
‘ఇజ్రాయెల్‌ ప్రభుత్వంతోనేకాదు దాని పొరుగున ఉన్న జోర్డాన్, ఈజిప్ట్‌ ఇతర అరబ్‌ దేశాలతో మంతనాలు జరుపుతున్నాం. ఇరువైపులా దాడులు, ప్రతిదాడులతో పాలస్తీనా, ఇజ్రాయెల్‌లలో నెలకొన్న మానవీయ సంక్షోభం పోగొట్టేందుకు ఐక్యరాజ్యసమితితోనూ సమష్టిగా కృషిచేస్తున్నాం. చర్చిస్తున్నాం’ అని అన్నారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)