Breaking News

ఇజ్రాయెల్‌ ఆరోపణలను ఖండించిన అల్ జజీరా

Published on Thu, 10/24/2024 - 13:45

గాజాలో ఆరుగురు అల్ జజీరా మీడియా సంస్థకు జర్నలిస్టులు పాలస్తీనా తీవ్రవాదులని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపణలు చేసింది. హమాస్, ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూపులతో  ఆరుగురు జర్నలిస్టులు అనుబంధంగా పనిచేస్తున్నారని వ్యాఖ్యలు చేసింది. ఈ ఆరోపణలై స్పందించిన ఖతార్‌కు చెందిన అల్‌ జజీరా మీడియా నెట్‌వర్క్  తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్‌ చేసిన ఆరోపణలు నిరాధారమని తోసిపుచ్చింది.

‘‘ఇజ్రాయెల్ సైన్యం మా జర్నలిస్టులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడాన్ని తిరస్కరిస్తున్నాం. ఇజ్రాయెల్‌ మా జర్నలిస్టులపై కల్పిత సాక్ష్యాలను సృష్టించడాన్ని తీవ్రం ఖండిస్తున్నాం. ఈ కల్పిత ఆరోపణలతో ఈ ప్రాంతంలో మిగిలి ఉన్న జర్నలిస్టుల గొతునొక్కేయడానికి ఇజ్రాయెల్‌ ప్రయత్నం చేస్తోంది. తద్వారా యుద్ధంలో జరుగుతున్న కఠినమైన వాస్తవాలను ప్రపంచానికి తెలియకూడదలనే కుట్రకు ఇజ్రాయెల్‌ తెరలేపింది. ఇజ్రాయెల్‌ బాంబు దాడులు, గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభాన్ని ఎప్పటికప్పుడూ ప్రసారం చేస్తున్న ఏకైక అంతర్జాతీయ మీడియా నెట్‌వర్క్ అల్ జజీరానే’’ అని ఓ ప్రకటనలో తెలిపింది.

.

‘‘గాజాలో హమాస్, ఇస్లామిక్ జిహాద్ తీవ్రవాద సంస్థలలోని సైనికులతో ఆరుగురు అల్ జజీరా జర్నలిస్టులు కలిసిపోయారని నిర్ధారించే గూఢచార సమాచారం, టెర్రరిస్ట్ శిక్షణా కోర్సుల జాబితా, ఫోన్‌లతో సహా గుర్తించబడ్డాయి. ఖతార్ అల్ జజీరా మీడియా నెట్‌వర్క్‌లో పనిచేసే సిబ్బంది హమాస్ ఉగ్రవాదులతో కలిసిపోయారడానికి ఈ పత్రాలే రుజువు. అల్ జజీరా హమాస్ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నట్లు చాలా మంది జర్నలిస్టులు బహిర్గతం చేశారు. అల్ జజీరా జర్నలిస్టులు.. అనస్ అల్-షరీఫ్, హోసామ్ షబాత్, ఇస్మాయిల్ అబు ఒమర్ , తలాల్ అర్రూకీలకు హమాస్‌తో సంబంధాలు ఉన్నాయి.అదేవిధంగా అష్రఫ్ సరాజ్, అలా సలామెహ్ ఇస్లామిక్ జిహాద్‌తో అనుబంధం కలిగి ఉన్నారు’’ అని బుధవారం ఇజ్రాయెల్‌  ‘ఎక్స్‌’లో పేర్కొంది.

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)