Breaking News

అమెరికా: రన్‌వేపై తలకిందులైన ప్రైవేట్ జెట్

Published on Mon, 01/26/2026 - 09:40

వాషింగ్టన్‌: అమెరికాలోని మైన్‌ (Maine) ప్రాంతంలోని బాంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఒక చిన్న ప్రయాణికుల విమానం రన్‌వేపై క్రాష్‌ అయి.. ఒక్కసారిగా బోల్తా పడింది. అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు వెంటనే అత్యవసర పరిస్థితిని ప్రకటించి, రన్‌వేను పూర్తిగా మూసివేశారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో విమానం ప్రమాదానికి గురైనట్లు సమాచారం. విషయంలో తెలియగానే ఎమర్జెన్సీ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విమానాశ్రయం వైపు ఎవరూ రావద్దని అధికారులు సోషల్ మీడియా ద్వారా ప్రజలను కోరారు.

ఫ్లైట్ ట్రాకింగ్ సంస్థ ‘ఫ్లైట్ రాడార్ 24’ అందించిన వివరాల ప్రకారం, ప్రమాదానికి గురైన విమానం బాంబార్డియర్ ఛాలెంజర్ 600 రకానికి చెందినది. ఈ ప్రైవేట్ జెట్ హ్యూస్టన్ నుండి బాంగోర్ విమానాశ్రయానికి చేరుకుందని, తిరిగి టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించిందని ఏడీఎస్-బి  సిగ్నల్ డేటా ద్వారా తెలుస్తోంది. ఈ విమానం హ్యూస్టన్‌కు చెందిన ఒక కంపెనీ పేరుపై రిజిస్టర్ అయి ఉన్నట్లు ఫెడరల్ రికార్డులు తెలియజేస్తున్నాయి.ఈ ప్రైవేట్ జెట్‌లో ఎనిమిది మంది ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని సీఎన్‌ఎన్‌ తెలిపింది. 

ప్రమాదం జరిగిన వెంటనే బాంగోర్, గ్లెన్‌బర్న్, హెర్మోన్ ప్రాంతాల నుండి అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్‌లు ఎయిర్‌ఫీల్డ్‌కు చేరుకున్నాయి. సహాయక బృందాలు వెళ్లేసరికి విమానం తలకిందులై ఉండగా, ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వస్తున్నట్లు స్థానిక టీవీ ఛానెల్స్ దృశ్యాలను ప్రసారం చేశాయి. ప్రమాద సమయంలో అక్కడ దట్టమైన మంచు కురుస్తుండటం, విపరీతమైన చలి కారణంగా సహాయక చర్యలకు ఆటంకం  ఏర్పడింది. అయితే ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమా అనేది ఇంకా తెలియరాలేదు.

విమానాశ్రయ అధికారులు రాత్రి 8:25 గంటలకు అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, ప్రమాదం జరిగిన విషయాన్ని ధృవీకరించారు. విమానంలో ఎంత మంది ఉన్నారు? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదని, గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రన్‌వేపై ఆపరేషన్స్ నిలిపివేశామని, విచారణ కొనసాగుతోందని తెలిపారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)