ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌లో నిద్రపోను.. నవ్వులు పూయించిన ట్రంప్‌

Published on Fri, 02/06/2026 - 08:37

ఎయిర్ ఫోర్స్ వన్ ప్రయాణాలపై డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌లో నేను నిద్రపోను. కిటికీలోంచి క్షిపణుల కోసం చూడటమే నా పని. క్షిపణులొస్తున్నాయేమో గమనిస్తానని ట్రంప్‌ అన్నారు. ‘నేషనల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రేయర్' కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

20 గంటల సుదీర్ఘ ప్రయాణంలో కూడా తాను అసలు నిద్రపోనంటూ చెప్పుకొచ్చారు. "నేను కిటికీలోంచి బయటకు చూస్తూ క్షిపణులు(missiles), శత్రువుల కోసం వెతుకుతుంటానంటూ ఆయన వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు పూశాయి. 

నిద్ర తక్కువ.. కబుర్లు ఎక్కువ
డొనాల్డ్ ట్రంప్ తనకు నిద్ర చాలా తక్కువని గతంలో కూడా చాలాసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. 2016 ఎన్నికల ప్రచారంలో తాను రోజుకు కేవలం 3 నుండి 4 గంటలు మాత్రమే నిద్రపోతానని, ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉంటానని చెప్పారు.

అలాగే.. 2019లో ఒక వైట్ హౌస్ అధికారి సీఎన్ఎన్‌తో మాట్లాడుతూ.. అధ్యక్షుడితో ప్రయాణించడం అంటే ‘బందీగా ఉండటం’ లాంటిదని వ్యాఖ్యానించారు. ట్రంప్ నిద్రపోవడానికి బదులుగా.. గంటల తరబడి సిబ్బందితో కబుర్లు చెబుతుంటారని, ప్రభుత్వ విషయాలే కాకుండా క్రీడల గురించి కూడా చర్చిస్తారని ఆయన తెలిపారు.

ఎయిర్‌ఫోర్స్‌ వన్‌.. ప్రత్యేకత ఏంటంటే..
అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఏ విమాన్నయినా ఎయిర్‌ఫోర్స్‌ 1 అనే పిలుస్తారు. ఈ విమానానికి ఎలాంటి అణుబాంబులనైనా తట్టుకునే సామర్థ్యం ఉంది. దాడి జరిగే అవకాశం ఉందని ఉప్పందితే చాలు మొబైల్‌ కమాండ్‌ సెంటర్‌గా మారుతుంది. నాలుగు జెట్‌ ఇంజిన్స్‌తో ఈ విమానం నడుస్తుంది. గంటకి వెయ్యి కి.మీ కంటే అధిక వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో  70 మంది వరకు ప్రయాణించవచ్చు. గాల్లోనే ఇంధనాన్ని నింపుకునే సౌకర్యం ఈ విమానానికి ఉండడం ప్రత్యేకత. దీంతో ఎంతసేపైనా ప్రపంచం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చుట్టేయగలదు.

విమానం లోపల విస్తీర్ణం 4 వేల చదరపు అడుగులు ఉంటుంది. మూడు అంతస్తుల్లో ఈ –విమానాన్ని తయారు చేశారు. వైట్‌ హౌస్‌లో ఉన్న సదుపాయాలన్నీ ఇందులో ఉంటాయి. అధ్యక్ష కార్యాలయం, జిమ్, కాన్ఫరెన్స్‌ గది, డైనింగ్‌ రూమ్, అత్యాధునిక సమాచార వ్యవస్థ, సిబ్బంది ఉండేందుకు లాంజ్‌ సహా సకల సౌకర్యాలు ఉంటాయి. ఒకేసారి 100 మందికి వంట చేసే సదుపాయం కూడా ఉంది. ప్రయాణ సమయంలో ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే అధునాతన వైద్య పరికరాలతో మినీ ఆస్పత్రి, అందుబాటులో వైద్యుడు ఉంటారు.

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)