Breaking News

ఏఐ ‘దొంగ’ ఫొటోలు.. కంగుతిన్న పర్యాటకులు

Published on Mon, 02/02/2026 - 10:53

ప్రకృతి రమణీయతకు, అద్భుతమైన బీచ్‌లకు పెట్టింది పేరు ఆస్ట్రేలియా... ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడి ప్రకృతి అందాలను చూసేందుకు వస్తుంటారు. అయితే ఇటీవల ఒక ప్రముఖ ట్రావెల్ వెబ్‌సైట్ చేసిన చిన్న పొరపాటు పర్యాటకులను విస్తుపోయేలా చేసింది.

ఆస్ట్రేలియాలోని టాస్మేనియా ప్రాంత పర్యటనలకు సంబంధించిన ఒక వెబ్‌సైట్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో లేని ప్రదేశాన్ని ఉన్నట్లుగా చూపించి పర్యాటకులను తప్పుదోవ పట్టించింది. ఈ  ఏఐ ఫీచర్ ఈశాన్య టాస్మేనియాలోని అడవుల్లో ‘వెల్డ్‌బరో హాట్ స్ప్రింగ్స్’ (వేడినీటి బుగ్గలు) ఉన్నాయని,  ఆ ప్రాంతం ప్రశాంతతకు నిలయమని వర్ణించింది. దీంతో పర్యాటకులు అక్కడికి క్యూ కట్టారు.

వెబ్‌సైట్ ఇచ్చిన సమాచారాన్ని నమ్మి ప్రకృతి ఒడిలో హాయిగా సేద తీరవచ్చని భావించిన పర్యాటకులు టాస్మేనియాకు చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్ళాక పర్యాటకులు అక్కడి సీన్‌ చూసి అవాక్కయ్యారు. వెబ్‌సైట్‌లో చెప్పినట్లుగా అక్కడ ఎటువంటి వేడినీటి బుగ్గలు లేకపోవడమే కాకుండా, ఆ ప్రాంతం వెబ్‌సైట్‌లోని వివరణకు పొంతన లేకుండా ఉంది. దీంతో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై 'ఆస్ట్రేలియన్ టూర్స్ అండ్ క్రూయిజెస్' యజమాని స్కాట్ హెన్నెస్సీ స్పందించారు. తమ వెబ్‌సైట్‌లోని ఏఐ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, దీనివల్ల తప్పుడు సమాచారం ప్రచురితమైందని ఆయన అంగీకరించారు. మార్కెటింగ్ కంటెంట్ కోసం ఒక థర్డ్ పార్టీ సంస్థకు బాధ్యతలు అప్పగించామని, సాధారణంగా తానే స్వయంగా ప్రతి పోస్ట్‌ను తనిఖీ చేస్తానని, అయితే తాను విదేశీ పర్యటనలో ఉండటం వల్ల ఈ పొరపాటు జరిగిందని ఆయన వివరించారు.

తమది మోసపూరిత సంస్థ కాదని, కేవలం సాంకేతిక కారణాలతోనే ఇలా జరిగిందని సంస్థ వివరణ ఇచ్చింది. ఈ పొరపాటు కారణంగా తమ వ్యాపార ప్రతిష్ట దెబ్బతినడంపై స్కాట్ హెన్నెస్సీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో వస్తున్న విమర్శలు తమను మానసికంగా కుంగదీస్తున్నాయన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అతిగా ఆధారపడటం వల్ల కలిగే ప్రమాదాలకు ఈ ఘటన ఒక హెచ్చరికగా నిలిచింది.

ఇది కూడా చదవండి: విద్యార్థుల దాడి.. చూపు కోల్పోయిన బాలుడు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)