Breaking News

పేరుకు ‘కృత్రిమ మేథ’.. పనిచేసేది మనుషులే.. అమెరికాలో మరో మోసం

Published on Sat, 04/12/2025 - 11:07

న్యూయార్క్‌: ఇటీవలి కాలంలో విస్తృతంగా వినియోగమవుతున్న కృతిమమేథ(Artificial intelligence) మనిషి ఆలోచనలకు సవాల్‌ విసురుతోంది. ఇటువంటి తరుణంలో అమెరికాలో ఒక వింత మోసం చోటుచేసుకుని, సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.  ఫిన్‌టెక్ స్టార్టప్ నిర్వాహకుడు ఆల్బర్ట్ సానిగర్ తన ‘నేట్’ (Nate)షాపింగ్ యాప్‌ కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారంగా నడుస్తున్నదని ప్రచారం చేసి, 50 మిలియన్‌ డాలర్లకు (సుమారు రూ. 420 కోట్లు) పైగా నిధులు సేకరించాడు. అయితే ఈ యాప్‌ ఫిలిప్పీన్స్‌లోని ఒక కాల్ సెంటర్‌లోని సిబ్బంది ద్వారా నడుస్తున్నదని విచారణలో తేలింది. ఈ మోసం బయటపడటంతో, సానిగర్‌పై అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్.. సెక్యూరిటీస్ ఫ్రాడ్, వైర్ ఫ్రాడ్ ఆరోపణలు నమోదు చేసింది. ఈ ఆరోపణలు నిజమైతే  ఆల్బర్ట్ సానిగర్‌కు గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి.

నేట్ యాప్‌ను ఆల్బర్ట్ సానిగర్(Albert Saniger) 2018లో రూపొందించాడు. ఈ యాప్ ఒక యూనివర్సల్ షాపింగ్ కార్డ్‌గా ప్రచారం చేశాడు. దీని ద్వారా యూజర్లు ఎలాంటి ఇ-కామర్స్ సైట్ నుంచైనా ఒకే క్లిక్‌తో దేనినైనా కొనుగోలు చేయవచ్చని తెలిపాడు. ఈ యాప్ ఏఐ టెక్నాలజీ ద్వారా షాపింగ్ ప్రక్రియను సులభతరం చేస్తుందని, బిల్లింగ్, షిప్పింగ్ వివరాలను  దానికదే నిర్వహిస్తుందని సానిగర్  పేర్కొన్నాడు. ఈ యాప్‌ కోసం ఆయన కోట్యూ, ఫోర్‌రన్నర్ వెంచర్స్, రెనెగేడ్ పార్టనర్స్ తదితర వంటి పెట్టుబడిదారుల నుంచి 50 మిలియన్‌ డాలర్లకుపైగా నిధులు సేకరించాడు.

అయితే ఈ యాప్‌లో ఏఐ ఆటోమేషన్(Automation) దాదాపు శూన్యం అని అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ తేల్చింది. యాప్ ద్వారా జరిగే కొనుగోళ్లను ఫిలిప్పీన్స్‌లోని కాల్ సెంటర్‌లోగల వందలాది ‘పర్చేజింగ్‌ అసిస్టెంట్స్’ నెరవేరుస్తున్నారని తేలింది. ఈ నేపధ్యంలో ఆల్బర్ట్ సానిగర్ ఏఐ టెక్నాలజీ  పేరును ఉపయోగించి, తప్పుడు కథనాన్ని సృష్టించాడని  డిపార్ట్‌మెంట్ పేర్కొంది. 2021 హాలిడే షాపింగ్ సీజన్‌లో యాప్ డిమాండ్‌ను తట్టుకునేందుకు సానిగర్ తన ఇంజనీరింగ్ టీమ్‌ను కొన్ని లావాదేవీలను ఆటోమేట్ చేయడానికి ‘బాట్‌లు’ అభివృద్ధి చేయాలని ఆదేశించాడు. అయితే ఈ బాట్‌లు ఏఐ ఆధారితం కాకుండా, మానవ సిబ్బంది ఆధారంగా పనిచేశాయి. ఆల్బర్ట్ సానిగర్ చేసిన మోసం బయటపడటంతో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) అతనిపై సివిల్ కేసు నమోదు చేసింది. అతనిని ఇకపై ఇలాంటి కంపెనీలలో అధికారిగా పనిచేయకుండా నిషేధించాలని కోరింది. అలాగే పెట్టుబడిదారుల నుంచి సేకరించిన నిధులను సానిగర్‌ తిరిగి వారికి ఇవ్వాలని ఆదేశించింది. ఇదేవిధంగా గతంలో ప్రెస్టో ఆటోమేషన్ అనే కంపెనీ ఏఐ ఆధారిత డ్రైవ్ త్రూ సేవలను అందిస్తామని చెప్పి, ఫిలిప్పీన్స్‌లోని సిబ్బందితో కార్యకలాపాలు సాగించి మోసానికి పాల్పడింది. 

ఇది కూడా చదవండి: గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)