Breaking News

బంగారం కంటే ఖరీదైన చెట్టు.. కిలో రూ. కోటి

Published on Wed, 02/11/2026 - 23:24

బంగారం ఖరీదైనదే కానీ ఈ చెట్టు మాత్రం బంగారాన్ని మించిపోయింది. కిలోకు కోటి రూపాయలు పలికే ఒకే ఒక్క మొక్క గురించి ఎప్పుడైనా విన్నారా? అది అగర్వుడ్. ఆగ్నేయాసియాలో పెరిగే అక్విలేరియా జాతి చెట్లలో అరుదుగా ఏర్పడే ఈ కలప.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సహజ వనరుల్లో ఒకటి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రతి చెట్టులా ఇది ఉండదు. సాధారణంగా ఈ చెట్లు వాసనలేని తెల్ల కలపతో ఉంటాయి. కానీ ఒక ప్రత్యేకమైన ఫంగస్ సోకినప్పుడు లేదా చెట్టు గాయపడినప్పుడు, అది తనను తాను రక్షించుకోవడానికి ముదురు, జిగట రసాన్ని విడుదల చేస్తుంది. ఆ రసమే కాలక్రమంలో సువాసనగల నల్ల అగర్వుడ్‌గా మారుతుంది.

అన్ని అక్విలేరియా చెట్లు అగర్వుడ్‌ని ఉత్పత్తి చేయవు. సహజంగా కేవలం 2 నుంచి 7 శాతం చెట్లలో మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతుంది. అది కూడా ఒక్క రోజులో కాదు.. 10 నుంచి 30 సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సిందే. ఈ అరుదైన, సుదీర్ఘమైన ప్రక్రియ కారణంగానే అగర్వుడ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలపగా గుర్తింపు పొందింది. ఇందులో కూడా అత్యంత నాణ్యమైన రకాన్ని 'క్యారా' అంటారు. దీని ధర గ్రాముకు రూ.8.5 లక్షల వరకు చేరుతుంది. షాంఘైలో జరిగిన ఒక వేలంలో 2 కిలోల క్యారా కలప ఏకంగా రూ.154 కోట్లకు అమ్ముడైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అంటే ఒక్క చిన్న ముక్కే కోట్ల విలువ కలిగి ఉంటుందంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే..

అగర్వుడ్‌ని ప్రపంచంలో చాలా ఖరీదైన పెర్ఫ్యూమ్‌లు తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా దుబాయ్, పారిస్ లాంటి నగరాల్లో లగ్జరీ సెంట్స్ కోసం దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. హిందూ, బౌద్ధ, ఇస్లామిక్ మతపరమైన ఆచారాల్లో అగర్వుడ్ ధూపానికి ప్రత్యేక స్థానం ఉంది. దాని సువాసన మనసుకు ప్రశాంతత ఇస్తుందని నమ్ముతారు. ఆయుర్వేదం, చైనీస్ వైద్యంలో ఒత్తిడి, నిద్రలేమి తదితర సమస్యలకు దీనిని ఉపయోగిస్తారు.

భారతదేశంలోని అస్సాం రాష్ట్రం మంచి అగర్వుడ్‌కి ప్రసిద్ధి. కానీ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో అక్విలేరియా చెట్లు తగ్గిపోతున్నాయి. అందుకే అగర్వుడ్ అమ్మకంపై కఠిన నియమాలు పెట్టారు. లైసెన్స్ ఉన్నవాళ్లు మాత్రమే దీనిని అమ్మగలరు. ఇప్పుడు సహజ అగర్వుడ్ చాలా ఖరీదైన, విలాసవంతమైన వస్తువుగా మారింది. బంగారం నేలలో దొరుకుతుంది. కానీ అగర్వుడ్ తయారవ్వడానికి ప్రకృతి ఎన్నో సంవత్సరాలు తీసుకుంటుంది.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)