Breaking News

ఇక సిరియాపైకి గురి.. మరిన్ని దాడులు తప్పవని హెచ్చరిక

Published on Thu, 10/12/2023 - 20:14

హమాస్‌ను లక్ష్యంగా చేసుకుని గాజాను విచ్ఛిన్నం చేసిన ఇజ్రాయెల్‌.. తాజాగా సిరియాపై కూడా గురిపెట్టింది. గురువారం సిరియాలోని డమాస్కస్, అలెప్పో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులపై క్షిపణులతో దాడులు చేసింది. దీంతో ఎయిర్‌ డిఫెన్స్ వ్యవస్థల్ని సిరియా యాక్టివేట్‌ చేసింది. అయితే.. ఈ దాడుల్లో డమాస్కస్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద నలుగురు, అలెప్పో వద్ద ముగ్గురు సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

దాడుల వల్ల విమానాశ్రయం దెబ్బతినడంతో రాకపోకలను రద్దు చేసినట్లు సిరియా వెల్లడించింది. ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో ఈ రెండు విమానాశ్రయాల్లో విమానాలను గ్రౌండింగ్‌ చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. 

పొరుగు దేశమైన సిరియాతో కూడా ఇజ్రాయెల్‌ దశాబ్దాలుగా పోరాడుతోంది. ప్రధానంగా ఇరాన్‌ మద్దతిస్తున్న హిజ్బుల్లా ఫైటర్స్‌తోపాటు సిరియా ఆర్మీని కూడా టార్గెట్‌ చేసింది. అయితే ఎప్పుడూ కూడా సిరియాపై దాడులను ఇజ్రాయెల్‌ ధృవీకరించలేదు.  కానీ, తాజాగా గురువారం సిరియాపై ఎయిర్‌స్ట్రైక్స్‌ చేసినట్టు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. అంతేకాదు.. ఈ దాడులు రాబోయే రోజుల్లో ఉధృతంగా కొనసాగుతాయని పేర్కొంది. 

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గురువారం ఇజ్రాయెల్‌ సందర్శించారు. అదే సమయంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ.. సిరియా బషర్‌ అల్‌ హసద్‌తో ఫక్షన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరాన్‌ మద్దతిస్తున్న హమాస్ ఆధిపత్యం ఉన్న గాజాతోపాటు సిరియాపై కూడా ఇజ్రాయెల్‌ క్షిపణులతో దాడులు చేయడం గమనార్హం.

ఇజ్రాయెల్‌పై హమాస్‌ మెరుపు దాడులు జరిగి నేటికి ఆరు రోజులు గడిచింది. ప్రతిదాడులతో హోరెత్తిస్తున్న ఇజ్రాయెల్‌.. గాజా స్ట్రిప్‌లో 1200 మందికి చంపేసింది. ఇందులో హమాస్‌ బలగాలతో పాటు సాధారణ పౌరులు కూడా ఉన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌ తరపున కూడా ప్రాణనష్టం భారీగానే సంభవించింది. ఇరువైపులా ప్రాణ నష్టం 3వేలు దాటినట్లు తెలుస్తోంది.

సాక్షి టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ క్లిక్‌ చేసి ఫాలో అవ్వండి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)