Breaking News

Antifa: మరో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్‌

Published on Thu, 09/18/2025 - 07:39

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వామపక్ష భావజాలమున్న ఎంటిఫా సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. కన్జర్వేటిక్‌ ఉద్యమకారుడు చార్లీ కిర్క్‌ హత్య నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన సోషల్‌ మీడియాలో స్వయంగా ఆయన ప్రకటన చేశారు.

ఎంటిఫాను ప్రధాన ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ సోషల్‌ మీడియా ద్వారా ట్రంప్‌​ ప్రకటన చేశారు. దానిని అత్యంత ప్రమాదకరమైన సంస్థగా.. రాడికల్ లెఫ్ట్ విపత్తుగా ఆయన అభివర్ణించారు. అంతేకాదు దీనికి నిధులు సమకూర్చే వారిపై కఠిన విచారణ జరపాలని దర్యాప్తు సంస్థలకు సూచించారాయన.

 

ఏంటీ ఎంటిఫా.. 
Antifa అంటే ఫాసిస్ట్‌ వ్యతిరేక (anti-fascist) పదానికి సంక్షిప్త రూపం. ఇదేం ఒక అధికార, కేంద్రీకృత సంస్థ కాదు. ఫార్-లెఫ్ట్ కార్యకర్తల గ్రూప్‌. ఫాసిజం, రేసిజం, అన్నింటికంటే ముఖ్యంగా  కన్జర్వేటివ్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడే రాజకీయ ఉద్యమం అని చెప్పొచ్చు. ఈ సభ్యులు తరచూ ఫార్-రైట్ ర్యాలీలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. బెల్లా సియావో(Bella Ciao) వంటి పాటలు, 1917 రష్యా విప్లవానికి సంబంధించిన గుర్తులను, నినాదాలను తమ నిరసనలకు ఉపయోగిస్తుంటారు. సోషల్ మీడియాలో సిగ్నల్‌, ఇతర ఎన్‌క్రిప్టెడ్‌ యాప్స్‌ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. అయితే.. 

ట్రంప్‌ గత టర్మ్‌లోనే ఈ గ్రూప్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాలని అనుకున్నారు. కానీ అది వీలుపడలేదు. ఇప్పుడు తనకు సన్నిహితుడైన చార్లీ కిర్క్‌ హత్యతో ఆ పని చేశారు. అయితే Antifa అనేది ఒక సిద్ధాంతం మాత్రమేనని, దానిని సంస్థగా గుర్తించి నిషేధించడం అసాధ్యమని, పైగా చట్టపరంగా ఇబ్బందులూ ఎదురుకావొచ్చని ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ క్రిస్టోఫర్ రే అభిప్రాయపడుతున్నారు. 

కిర్క్‌ మరణం
కన్జర్వేటివ్‌ కార్యకర్త చార్లీ కిర్క్‌ మరణం.. అమెరికాలో రాజకీయ దుమారం రేపింది. సెప్టెంబర్‌ 10వ తేదీన ఉటా యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ని రైఫిల్‌తో కాల్చి చంపారు.  ఒకే భావజాలం ఉన్న ట్రంప్‌ కోసం అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కిర్క్‌ ప్రచారం కూడా చేశారు. దీంతో తన ఆప్తుడి మరణంపై ట్రంప్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని మండిపడ్డారాయన. 

ఈ క్రమంలో.. వామపక్ష భావజాలం ఉన్న 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్ అనే వ్యక్తిని ఎఫ్‌బీఐ అరెస్ట్‌ చేసింది. ఘటనా స్థలంలో "Hey fascist! Catch!" వంటి రాతలున్న బుల్లెట్‌ కేసింగ్‌లపై కనిపించడం గమనార్హం. అయితే రాబిన్‌సన్‌ Antifa సభ్యుడా అనే విషయాన్ని ఎఫ్‌బీఐ ఇంకా నిర్ధారించలేదు. కానీ ట్రంప్ మాత్రం అతను ‘‘ఇంటర్నెట్ ద్వారా రాడికలైజ్‌ అయ్యాడు’’ అని చెబుతుండడం గమనార్హం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)