Breaking News

అఫ్గనిస్తాన్‌లో బస్సు దగ్ధం 17 మంది పిల్లలు సహా 73 మంది మృతి

Published on Thu, 08/21/2025 - 02:16

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌లోని పశ్చిమ హెరాత్‌ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో ప్రయాణిస్తున్న ఓ బస్సు.. ట్రక్కు, మో­టా­ర్‌ సైకిల్‌ను ఢీకొట్టడంతో మంట­లు చెలరేగి దగ్ధం అయ్యింది. ఈ ప్రమాదంలో 17 మంది పిల్లలు సహా 73 మంది మరణించా­రు. ఇరాన్‌ నుంచి బహిష్కరణ­కు గురైన అఫ్గాన్‌ వలసదారులతో నిండిన బస్సు మంగళవారం కాబూల్‌కు బయలుదేరింది. సరిహద్దు దా­టి­న తరువాత హెరాత్‌ ప్రావిన్స్‌లో ప్రమాదానికి గురైంది. బస్సులో ఉన్న ప్రతి ఒక్కరూ మరణించారు. ఇతర వాహనాల్లో ఇద్దరు వ్యక్తులు కూడా మరణించారు. బస్సు డ్రైవర్‌ మితిమీరిన వేగం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని హెరాత్‌ పో­లీçÜు­లు ప్రాథమిక విచారణలో తేల్చారు.  

దశాబ్దాల సంఘర్షణ కారణంగా రోడ్లు దెబ్బతిన్న అఫ్గానిస్తాన్‌లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి. ఇక 1970ల నుంచి లక్షలాది మంది ఆఫ్గన్లు ఇరాన్, పాకిస్తాన్‌లకు పారిపోయారు. 1979లో సోవియట్‌ దండయాత్ర సమయంలో, 2021లో తాలిబన్లు దేశాన్ని తమ వశం చేసకున్న తరువాత ఈ వలసలు పెద్ద ఎత్తున కొనసాగాయి. ఇరాన్‌లో క్రమక్రమంగా అఫ్గాన్‌ వ్యతిరేక భావన పెరిగింది. శరణార్థులు చాలాకాలంగా వ్యవస్థాగత వివక్షను ఎదుర్కొంటున్నారు. పత్రాలు లేని అఫ్గాన్లు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలంటూ మార్చిలోనే హెచ్చరించిన ఇరాన్‌ జూలై వరకు ఇచ్చిన గడువు కూడా పూర్తయ్యింది. జనవరి నుంచి 15 లక్షల మందికి పైగా అఫ్గాన్లు ఇరాన్‌ను వదిలి వెళ్లారని ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ తెలిపింది.

వీరిలో చాలా మంది తరతరాలుగా ఇరాన్‌లో నివసిస్తున్నవారు కావడం గమనార్హం. జూన్‌లో ఇజ్రాయెల్‌తో జరిగిన స్వల్పకాలిక యుద్ధం తర్వాత జాతీయ భద్రతపై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో.. లక్షలాది మంది అఫ్గాన్లను ఇరాన్‌ అధికారులు బలవంతంగా తిప్పి పంపించారు. భద్రతా వైఫల్యాలతో జరిగిన ఇజ్రాయెల్‌ దాడులకు అఫ్గాన్లను బలిపశువులు చేస్తున్నారనేది విమర్శకుల వాదన. ఎలాంటి పత్రాలు లేని అఫ్గాన్లను పాకిస్తాన్‌ కూడా వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు దేశాల నుంచి తిరిగి అఫ్గానిస్తాన్‌కు వచి్చన శరణార్థుల సంఖ్య లక్షల్లో ఉంది. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)