Breaking News

75 ఏళ్ల తర్వాత... తన పూర్వీకులను కలుసుకున్న 92 ఏళ్ల బామ్మ!

Published on Sun, 07/17/2022 - 16:51

ఇస్లామాబాద్‌: సుహృద్బావన చర్యలో భాగంగా పాకిస్తాన్‌ హైకమిషన్‌ రీనా చిబర్‌ అనే 92 ఏళ్ల భారతీయ మహిళకు మూడు నెలల వీసాను జారీ చేసింది. దీంతో ఆమె తన పూర్వీకులు ఇంటిని సందర్శించడానికి పాకిస్తాన్‌ పయనమయ్యింది. ఈ మేరకు ఆమె పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ప్రేమ్‌నివాస్‌లో ఉన్న తన పూర్వీకుల ఇంటిని చూసేందుకు శనివారం వాఘా అట్టారీ సరిహద్దులను దాటి వెళ్లింది.  సదరు మహిళ కుటుంబం 1947లో దేశ విభజన సమయంలో భారత్‌కి తరలివెళ్లింది.

అప్పుడు ఆమెకు 15 ఏళ్లు. ఆ తర్వాత 1965లో ఆమె పాకిస్తాన్‌లో ఉంటున్న తన పూర్వీకుల ఇంటిని సందర్శించడానికి వీసా కోసం దరఖాస్తు చేసింది. ఐతే ఆ సమయంలో ఇరు దేశాల మధ్య యుద్ధం కారణంగా... తీవ్ర ఉద్రిక్తల నడుమ ఆమెకు వీసా లభించలేదు. ఆ తదనంతరం ఆమె ఎన్నోసార్లు ప్రయత్నించినా ఆమెకు వీసా లభించలేదు.

ఎన్నో సిఫార్సులు, మరికొద్దిమంది పలుకబడిన వ్యక్తుల సహాయ సహకారాలతో ఆమె పాకిస్తాన్‌ హై కమిషన్‌ నుంచి వీసా పొందగలిగింది. ఈ మేరకు ఆమె తనకు ఇరు దేశాల నుంచి సులభంగా రాకపోకలు సాగించేలా వీసా పరిమితులను సడలించడానికి రెండు దేశాల ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. తన పూర్వీకులు ఇంటిని, స్నేహితులను కలుసుకున్నాందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది.

(చదవండి: చైనా పదే పదే ఇలా ఎందుకు చేస్తుందో చెప్పలేను’)

Videos

New Movie: ఏకంగా ముగ్గురితో అల్లుఅర్జున్

ప్రభాస్ స్పిరిట్ కోసం ఈ ముగ్గురిలో ఎవరు..?

మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు

స్పిరిట్ నుండి దీపికా అవుట్..! సందీప్ వంగా దీపికాను ఎందుకు తీసివేశాడు..?

నంబాల కేశవరావు మృతదేహం అప్పగింతపై సందిగ్ధత

రాజధాని రివర్స్.. వద్దు మొర్రో అన్నా వినలేదు

అనకాపల్లి జిల్లా టీడీపీ మహానాడు సభ అట్టర్ ఫ్లాప్

విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం

మళ్లీ అదే తీరు దక్షిణాఫ్రికా అధ్యక్షుడి రమఫొసాతో ట్రంప్ వాగ్వాదం

స్కామ్ స్టార్ బాబు అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసిన YS జగన్ మోహన్ రెడ్డి

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)