Breaking News

యూఎస్‌ ‘అవాంఛిత’ జాబితాలో మనోళ్లు

Published on Thu, 02/12/2026 - 05:52

అమెరికాలో వలసదారులను లక్ష్యం చేసుకుని ట్రంప్‌ సర్కారు తాజాగా మరో చర్యకు దిగింది. ‘పలు తీవ్ర నేరాలకు పాల్పడ్డ, అభియోగాలను ఎదుర్కొంటున్న వారు’ అని పేర్కొంటూ పాతిక వేల మంది వలసదారులతో కూడిన జాబితాను హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్‌) తాజాగా విడుదల చేసింది. ‘అత్యంత దారుణాలకు పాల్పడి అరెస్టైన వారు’ అనే పేరిట ఈ మేరకు ఏకంగా సరికొత్త డేటాబేస్‌నే రూపొందించారు! 

2025 నుంచి అమెరికా ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) అదుపులోకి తీసుకున్న వారితో కూడిన ఈ జాబితాలో 89 మంది భారతీయులున్నారు. వీరిలో అత్యధికులు ఆర్థిక నేరాలు, మోసాల కేసుల్లో పోలీసులకు చిక్కినవారే కావడం గమనార్హం. కాగా కొందరు లైంగిక దాడులు, డ్రగ్‌ ట్రాఫికింగ్, ఇతర హింసాత్మక నేరాల్లో అరెస్టయ్యారు. 

అమెరికాలో ఉన్న వలసదారుల్లో నేరగాళ్లు, అసాంఘిక శక్తులను దేశ పౌరుల్లో ప్రతి ఒక్కరూ సులువుగా గుర్తించేందుకు తాము రూపొందించిన ఈ కొత్త వెబ్‌సైట్‌ తోడ్పడుతుందని డీహెచ్‌ఎస్‌ అసిస్టెంట్‌ సెక్రెటరీ ట్రిసియా మెక్‌లాలిన్‌ చెప్పారు. అలాగే వారు పాల్పడ్డ నేరాలు, వాటి తీవ్రత కూడా అందరికీ తెలిసొస్తుందన్నారు. 

పారదర్శకతను పెంచే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఈ నిందితులను వారి పేరు, జాతీయత, అరెస్టయిన రాష్ట్రం... ఇలా పలు రకాలుగా సెర్చ్‌ చేసి చూసుకునేందుకు సంబంధిత వెబ్‌సైట్‌లో అవకాశం కల్పించారు. ఈ జాబితాలోని 89 మంది భారతీయుల్లో 22 మందిపై దొంగతనాలు, పన్ను ఎగవేత, ఆన్‌లైన్‌ మోసాల వంటి ఆర్థిక నేరాల అభియోగాలున్నాయి. 21 మంది దోపిడీలు, ఇతర హింసాత్మక ఘటనల అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 17 మంది లైంగిక నేరాల్లో పోలీసులకు చిక్కారు. 

అణచివేతను సమర్థించుకునేందుకే...! 
డీహెచ్‌ఎస్‌ రూపొందించిన ఈ ‘అత్యంత దారుణ నేరగాళ్ల’జాబితా పలు విమర్శలకు కూడా తావిస్తోంది. దానిపై స్థానిక సామాజికవేత్తలు, హక్కుతల నేతలే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు! ‘‘నిందితులు, వారు పాల్పడ్డారంటున్న నేరాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపకుండా కేవలం పోలీసుల అదుపులో ఉండగా తీసిన వాళ్ల మగ్‌షాట్స్‌ (ఫొటోలు), సైట్‌లో ఉంచడం, విచారణ దశలోనే ఏకపక్షంగా నేరగాళ్లనే ముద్ర వేయడం దారుణం. 

ఇది ఏ మాత్రమూ సరికాదు. కేవలం వలసదారులపై తీసుకుంటున్న అత్యంత కఠినమైన అణచివేత చర్యలను సమర్థించుకోవడమే దీని లక్ష్యంగా కనిపిస్తోంది’’అని వారు ఆరోపిస్తున్నారు. ‘‘ఈ జాబితా పూర్తిగా శ్వేతేతరులతో నిండిపోయి ఉంది. దీన్ని చూసే అమెరికన్లకు వారంతా నేరగాళ్లు, దొంగలు అన్న అభిప్రాయం ఏర్పడే ఆస్కారముంది’’అంటూ మైన్‌ వలసదారుల హక్కు సంఘం నేత రూబెన్‌ టోరెస్‌ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. 

అసలు పనిగట్టుకుని మరీ ఇలాంటి వెబ్‌సైట్‌ రూపొందించి హడావుడిగా ఇలా పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాల్సిన అవసరం ఏమొచి్చందని యూనివర్సిటీ ఆఫ్‌ మన్‌ స్కూల్‌ ఆఫ్‌ లాస్‌కు చెందిన రెఫ్యూజీ అండ్‌ హ్యూమన్‌రైట్స్‌ క్లినిక్‌ డైరెక్టర్‌ అన్నా వెల్చ్‌ ప్రశ్నించారు. ఇది కేవలం అమెరికావ్యాప్తంగా వలసదారులపై ట్రంప్‌ సర్కారు ఏడాదికి పైగా పాల్పడుతున్న అత్యంత అమానవీయ చర్యలను సమర్థించుకునే ఎత్తుగడగానే కనిపిస్తోందంటూ ఆక్షేపించారు. డీహెచ్‌ఎస్‌ వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతున్నాయి. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)