Breaking News

సౌదీపై రెచ్చిపోయిన హూతీలు.. క్షిపణులు, డ్రోన్లతో దాడి

Published on Tue, 09/08/2026 - 17:49

రియాద్: సౌదీ అరేబియాపై యోమన్‌ హూతీలు రెచ్చిపోయారు. ఈ దేశంలోని పౌర సముదాయాలతో పాటు ఆర్థిక కేంద్రాలే లక్షంగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకపడ్డారు.దక్షిణ ప్రాంతంలో ఉన్న పలు ఇంధన రంగానికి చెందిన సంస్థలు, కీలక స్థావరాలే టార్గెట్‌గా దాడులు చేశారు. అయితే ఈ దాడుల్లో 73 మంది గాయపడినట్లు సౌదీ అరేబియా అధికారులు తెలిపారు. ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొన్నారు.

కాగా ఈ దాడులు తమ చర్యలేనని హౌతీలు ప్రకటించారు. సౌదీ-యెమెన్ సరిహద్దుకు సమీపంలోని అబ్హా, జిజాన్ ప్రాంతాల్లోని ప్రభుత్వ రంగ చమురు సంస్థ అరామ్‌కోకు చెందిన సౌకర్యాలతో పాటు అబ్హా అంతర్జాతీయ విమానాశ్రయం, కింగ్ ఖాలిద్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు.

ఈ దాడులపై సౌదీ అరేబియా తీవ్రంగా స్పందించింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సౌదీ  స్పష్టం చేసింది. పౌరులు, ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం, ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేయడం తక్షణమే నిలిపివేయాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

మరోవైపు యెమెన్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సౌదీ మద్దతుతో ఉన్న ఆ దేశ ప్రభుత్వం, హూతీల ఆధీనంలోని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఎదురుదాడిని ప్రారంభించింది. దీనికి ప్రతిగా హూతీలు సౌదీ అరేబియాపై దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు యెమెన్‌లోని ఓ జైలుపై జరిపిన దాడిలో 11 మంది మరణించారు. దానికి ప్రతికారంగా ఈ దాడులు జరిపినట్లు హూతీలు ప్రకటించారు. 

 

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)