Breaking News

ఇదేం విడ్డూరం.. 16 ఏళ్ల బాలికను పెళ్లాడిన 65 ఏళ్ల మేయర్‌!

Published on Mon, 05/01/2023 - 15:36

ప్రేమకే కాదు, పెళ్లికి కూడా వయసుతో సంబంధం లేదని నిరూపించాడు ఓ వ్యక్తి. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆరు పదుల వయసు దాటిన ఆయన తాజాగా  పట్టుమని 20 ఏళ్లు కూడా లేని మైనర్‌ను మనువాడాడు. 65 ఏళ్ల మేయర్‌.. 16 ఏళ్ల పాపను పెళ్లాడటమే కాకుండా పిల్లనిచ్చిన అత్తకు ఏకంగా ప్రభుత్వ శాఖలో పదోన్నతి కూడా కల్పించాడు.

ఈ వింత పెళ్లి బ్రెజిల్‌ దేశంలో వెలుగుచూసింది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఈ పెళ్లి వ్యవహారం మేయర్‌ను ఇరకాటంలో పడేసింది. వివరాలు.. దక్షిణ బ్రెజిల్‌లోని పరానా రాష్ట్రం అరౌకారియా సిటీ మేయర్ అయిన 65 ఏళ్ల హిస్సామ్ హుస్సేన్ దేహైనీ గత ఏప్రిల్‌ నెలలో తన కంటే 49 ఏళ్లు వయస్సులో చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
చదవండి: తిండి లేదు.. తిప్పలు పడింది.. విశ్వాసమే మళ్లీ నెగ్గింది!


 

కాగా బ్రెజిల్‌లో అమ్మాయిల కనీసం వివాహ వయసు 16 ఏళ్లు. అక్కడి చ‌ట్టాల ప్ర‌కారం 16 ఏళ్లు దాటిన యువ‌తులు తల్లిదండ్రుల అనుమ‌తితో త‌మ‌కు నచ్చిన వారిని వివాహం చేసుకోవ‌చ్చు. తాజాగా మేయ‌ర్  సదరు అమ్మాయికి ఏప్రిల్‌ 11న, 16 ఏళ్లు నిండటంతో మరుసటి రోజే అంటే ఏప్రిల్ 12న ఆమెను పెళ్లాడాడు. అంతేగాక అప్పటికే విద్యాశాఖలో తక్కువ జీతంతో పనిచేస్తున్న వధువు తల్లిని సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శిగా నియమించాడు.

ఇదే ప్రస్తుతం అతని కొంప ముంచింది. కూతురిని పెళ్లాడటం కోసం తల్లికి లంచంగా పదోన్నతి కట్టబెట్టినట్లు డిప్యూటీ మేయర్‌ సీమా ఆరోపించింది. దీంతో మేయర్‌పై వచ్చిన అవినీతి, బంధుప్రీతి ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. కాగా దేహైనీకి ఇది మూడో వివాహం. ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చాడు. కొత్త భార్యకు పదహారేళ్లే కావడంతో ఆమె కాలేజీకి వెళ్తోంది.
చదవండి: వయాగ్రాపై బ్యాన్.. ఉడుం నూనె కోసం ఎగబడుతున్న యువత..!

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)