Breaking News

ఆరేళ్ల పాపను పెళ్లాడాడు.. మూడేళ్లు ఆగాలన్న సర్కారు! 

Published on Fri, 07/11/2025 - 05:50

తాలిబన్ల అఫ్గానిస్తాన్‌లో బాల్య వివాహాలు నానాటికీ విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఆ ఘోరాల పరంపరకు పరాకాష్ట వంటి ఉదంతం తాజాగా దక్షిణ అఫ్గాన్‌లో చోటుచేసుకుంది! 45 ఏళ్ల వయసున్న ఓ ప్రబుద్ధుడు ఆరేళ్ల పాపను పెళ్లాడాడు. కాసుల కక్కుర్తితో తండ్రే ఆ చిన్నారిని పెళ్లి పేరిట ఇలా సదరు కామాంధునికి కట్టబెట్టాడట. ఇదే ఘోరమంటే, దీనిపై తాలిబన్‌ సర్కారు మరీ అరాచకంగా స్పందించింది. ‘నువ్వు చేసిన పని మమ్మల్ని షాక్‌కు గురి చేసింది. అంత చిన్న వయసు పాపను పెళ్లాడకుండా ఉండాల్సింది. 

కనీసం తనకు తొమ్మిదేళ్లు వచ్చేదాకా, అంటే మరో మూడేళ్ల దాకా కాపురానికి తీసుకెళ్లడానికి వీల్లేదు’ అని సదరు నవ వరుడిని ఆదేశించింది. అతనితో పాటు పాప తండ్రిని లాంఛనంగా అరెస్టు చేసింది. అమెరికాకు చెందిన అఫ్గాన్‌ సంస్థ ఏఎంయూ.టివి ఈ మేరకు పేర్కొంది. మనవాడికి అప్పటికే రెండు పెళ్లిళ్లయ్యాయట. పాప ప్రస్తుతానికి తల్లి దగ్గరే ఉన్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఇదెక్కడి పాడు పని అంటూ సోషల్‌ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. చిన్న పాప పక్కన పెళ్లి దుస్తుల్లో ఉన్న వరుని ఫొటోలు వైరల్‌గా మారాయి. మానవ హక్కుల సంఘాలు కూడా తాలిబన్ల తీరుపై దుమ్మెత్తిపోస్తున్నాయి. 

రూపురేఖలను బట్టి రేటు! 
అఫ్గాన్‌లో అమల్లో ఉన్న దుర్మార్గమైన వాల్వార్‌ సంప్రదాయం మేరకు ఈ పెళ్లి జరిగింది. ఇందులో వధువు శరీరాకృతి, చదువు తదితరాల ఆధారంగా తనకు ధర నిర్ణయిస్తారు. అది చెల్లించిన వాడికిచ్చి పెళ్లి చేస్తారు. 2021లో తాలిబన్లు అఫ్తాన్‌ను హస్తగతం చేసుకున్న నాటినుంచీ బాల్య వివాహాలు పెచ్చరిల్లాయి. దుర్భర దారిద్య్రం దీనికి తోడైంది. పిల్లలను పెంచలేక తల్లిదండ్రులు ఇలా ఆడపిల్లలను పెళ్లి సాకుతో అయినకాడికి అమ్ముకుంటున్నారు. దేశంలో అమ్మాయిలకు అసలు కనీస వివాహ వయసు నిబంధనే లేదు. అమ్మాయిల చదువుపై నిషేధం విధించడంతో అఫ్గాన్‌లో కొన్నేళ్లుగా బాల్య వివాహాలు దేశంలో ఏకంగా 45 శాతానికి పెరిగినట్టు ఐరాస నివేదిక పేర్కొంది.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

 

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి