ప్రాణాన్ని కాపాడిన బుల్లి బ్యాట్‌మ్యాన్‌.. నిజంగానే సూపర్‌ హీరో

Published on Sun, 07/19/2026 - 20:22

హీరోలు పుట్టుకతో రారు. పరిస్థితులకు అనుగుణంగా మంచి హృదయంతో ఒక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయమే వారిని హీరోలుగా నిలబెడుతుంది. ఇంగ్లాండ్‌లోని మెర్సీసైడ్‌లోని న్యూ బ్రైటన్‌లో బ్యాట్‌మ్యాన్ వేషంలో ఉన్న ఐదేళ్ల బాలుడు అలాంటి హీరో అయ్యాడు.

వేగంగా నీటిలో మునిగిపోతున్న ఇసుకదిబ్బపై ఓ వ్యక్తి చిక్కుకుని ఆ ఊబిలో కూరుకుపోతున్నాడు. అదే సమయంలో లూకాస్ అనే 5 ఏళ్ల బాలుడు పాఠశాలలో సూపర్ హీరో పాత్ర పోషించి ఇంటికి తిరిగి వస్తున్నాడు. అతడు వస్తున్న కారు తీరప్రాంత రహదారిపై వెళ్తున్న సమయంలో.. ఊబిలో కూరుకుపోతున్న వ్యక్తిని చూశాడు. దీంతో లూకాస్‌ వెంటనే బ్యాట్‌మ్యాన్‌లా స్పందించాడు. 

దూరంలో ఉన్న ఆ వ్యక్తిని చూపించాడు. కుటుంబ సభ్యులు వెంటనే కారు ఆపి విర్రల్ కోస్ట్‌గార్డ్‌కు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే ఆర్‌ఎన్‌ఎల్‌ఐ సిబ్బందికి సమాచారం చేరింది. వారు వచ్చి ఆ వ్యక్తిని కాపాడారు. ఆ వ్యక్తిని లూకాస్‌ చూడకపోయినా, చూసి స్పందించకపోయినా బాధితుడు మృతి చెందేవాడు. బ్యాట్‌మ్యాన్‌ వేషంలో ఉన్న లూకాస్‌ను అందరూ నిజమైన బ్యాట్‌మ్యాన్‌ నువ్వే అంటూ ప్రశంసలు కురిపించారు.

“అతను తన డ్యాన్స్ స్కూల్ సంగీత ప్రదర్శనలో బ్యాట్‌మ్యాన్ పాత్ర పోషించాడు. ఇంటికి వస్తున్న సమయంలో కిటికీలోంచి చూసి, ‘అది ఏమిటి?’ అని అడిగాడు” అని లూకాస్ వాళ్ల ఆంటీ డెబ్బీ ముర్రే చెప్పింది. “మేము చూసేసరికి ఆ వ్యక్తి ప్రాణాలు రక్షించాలంటూ చేతులు ఊపుతున్నాడు. వెంటనే కారు ఆపి, నేను ఫోన్ తీసుకున్నాను. మా పక్కగా కొందరు నడుచుకుంటూ వెళ్లారు. అతను అరుస్తున్నా కూడా అంత దూరంలో ఉండటంతో ఎవరికీ వినిపించి ఉండేది కాదు” అని ఆమె గుర్తు చేసుకుంది.

అదృష్టవశాత్తూ అప్పటికే శిక్షణలో ఉన్న లైఫ్‌బోట్ వెంటనే అక్కడికి చేరుకుంది. చిక్కుకున్న వ్యక్తిని, అతని రెండు కుక్కలను రక్షించింది. డెబ్బీ, సహాయక కార్యకర్తగా పని చేస్తోంది. “అతను చిన్న బొట్టులా కనిపించాడు. అందుకే జూమ్ చేశాను. నా ఫోన్‌లో జూమ్ చాలా బాగుంది. అయినా అతను చాలా చిన్నగానే కనిపించాడు. అంత దూరంలో ఉన్నాడు. ఇసుక వేర్వేరు ఎత్తుల్లో ఉంటుంది. అతను ఎత్తైన ఇసుకదిబ్బపై చిక్కుకున్నాడు. అదే అత్యంత ఎత్తైన చోటు. అక్కడి నుంచి ముందుకు అడుగు వేస్తే పూర్తిగా నీటిలో మునిగిపోయేవాడు” అని ఆమె చెప్పింది. కోస్ట్‌గార్డ్ సిబ్బంది సరైన సమయంలో అక్కడికి చేరుకున్నారని ఆమె తెలిపింది.

ఈ అంతా జరుగుతున్న సమయంలో లూకాస్ కారులోనే బ్యాట్‌మ్యాన్ దుస్తుల్లో కూర్చున్నాడు. “నువ్వు ఆ వ్యక్తి ప్రాణం కాపాడటంలో సాయం చేశావు” అని అతని అత్త చెప్పింది. వెంటనే ఆ చిన్నారి, “బ్యాట్‌మ్యాన్‌లాగే!” అని సమాధానం ఇచ్చాడు. ఆ ‘బ్యాట్‌మ్యాన్’కు న్యూ బ్రైటన్ లైఫ్‌బోట్ కేంద్రాన్ని సందర్శించే ఆహ్వానం వచ్చింది. 4, 5 ఏళ్ల చిన్నారుల స్కౌట్స్ విభాగమైన స్క్విరెల్స్ సభ్యుడైన లూకాస్.. తన పనికి గుర్తింపుగా 999 బ్యాడ్జ్ వస్తుందని ఆశిస్తున్నాడు. 999 బ్యాడ్జ్ అంటే అత్యవసర పరిస్థితిలో సరైన విధంగా స్పందించిన చిన్నారులకు ఇచ్చే గుర్తింపు చిహ్నం.

#

Tags : 1

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)