Bangladesh unrest: భారత్‌కు తిరిగొచ్చిన 4,500 మంది విద్యార్థులు

Published on Mon, 07/22/2024 - 08:02

బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హింసాయుత ఘటనలు చోటుచేసుకుంటుండటంతో 4,500 మందికి పైగా భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇదేవిధంగా నేపాల్ నుండి 500 మంది, భూటాన్ నుండి 38 మంది, మాల్దీవుల నుండి ఒకరు భారతదేశానికి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ  ఓ ప్రకటనలో తెలిపింది. బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్ భారత పౌరుల భద్రతపై స్థానిక అధికారులతో  సంప్రదింపులు జరుపుతోంది.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 4,500 మందికి పైగా భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఢాకాలోని భారత హైకమిషన్, చిట్టగాంగ్, రాజ్‌షాహి, సిల్హెట్, ఖుల్నాలోని అసిస్టెంట్ హైకమిషన్లు భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు సహాయం అందిస్తున్నాయి. భారత్‌-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దులు, విమానాశ్రయాలకు భారత పౌరులు సజావుగా వెళ్లేలా చూసేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంబంధిత అధికారులతో  సంప్రదింపులు జరుపుతోంది.

బంగ్లాదేశ్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలలో   ఇప్పటికీవున్న భారతీయ విద్యార్థులు, ఇతర భారతీయులతో భారత హైకమిషన్ టచ్‌లో ఉంది. బంగ్లాదేశ్‌లో మొత్తం 15 వేల మంది భారతీయ పౌరులు ఉన్నారని, ఇందులో 8,500 మంది విద్యార్థులు ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన తమిళులను ఆదుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్న నేపథ్యంలో సరిహద్దు భద్రతా దళం భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిఘాను  మరింతగా పెంచింది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)