Breaking News

USA: విషాదాన్ని మిగిల్చిన ఎన్‌ఆర్‌ఐ వృద్ధుల ‘అదృశ్య ఘటన’

Published on Sun, 08/03/2025 - 22:09

అమెరికాలో న్యూయార్క్‌కు చెందిన నలుగురు భారత సంతతి వృద్ధులు అదృశ్యమైన సంగతి తెలిసిందే. వీరు కనిపించకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపట్టారు. వీరి ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే, చివరికి ఈ అదృశ్య ఘటన విషాదాన్ని మిగిల్చింది.

వెస్ట్‌ వర్జీనియాలోని ఓ ఆధ్యాత్మిక ప్రాంతానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని.. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు మార్షల్‌ కౌంటీ పోలీసులు తెలిపారు. మరణించినవారు ఒకే కుటుంబానికి చెందిన ఆశా దివాన్‌(85), కిశోర్‌ దివాన్‌ (89), శైలేష్‌ దివాన్ (86), గీతా దివాన్‌ (84)లుగా పోలీసులు గుర్తించారు. న్యూయార్క్‌లోని బఫెలో నుంచి వెస్ట్‌ వర్జీనియాలోని మార్షల్‌ కౌంటీలో ఉన్న ప్యాలెస్‌ ఆఫ్‌ గోల్డ్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో బిగ్‌ వీలింగ్‌ క్రీక్‌ రోడ్డులో వీరి వాహనం అదుపు తప్పింది. దీంతో రోడ్డు పక్కకు దూసుకుపోయింది. దీంతో ఈ ప్రమాదాన్ని ఎవ్వరూ గమనించలేకపోయారు.

జులై 29న అదృశ్యం కాగా, వీరి వాహనం ప్రమాదానికి గురైనట్లు నిన్న (ఆగస్టు 2) పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో ఆ నలుగురు మృతి చెందినట్లు పోలీసులు ద్రువీకరించారు. చివరిసారిగా జులై 29న వీరు పెన్సిల్వేనియాలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా పోలీసులు గుర్తించారు. క్రెడిట్ కార్డును కూడా చివరిసారి అక్కడే వాడినట్లు తెలిసింది. నలుగురి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు.. హెలికాప్టర్‌లను కూడా రంగంలోకి దించారు. చివరికి వారు ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు నిర్థారించారు.


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)