Breaking News

Bangladesh: గిరిజన బాలికపై సామూహిక అకృత్యం.. నిరసనల్లో ముగ్గురు మృతి

Published on Mon, 09/29/2025 - 11:37

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఒక బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం తీవ్ర నిరసనలకు దారి తీసింది. గిరిజన పాఠశాలకు చెందిన ఒక విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా జమ్ము స్టూడెంట్స్ బృందం  నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ నేపధ్యంలో ఆదివాసీ గిరిజనులకు, ఇక్కడ స్థిరపడిన బెంగాలీవారికి మధ్య అల్లర్లు చోటుచేసుకున్నాయి. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించినప్పటికీ ఘర్షణలు కొనసాగి, ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు.  

భారత్‌- మయన్మార్ సరిహద్దుల్లోని చిట్టగాంగ్ కొండ ప్రాంతాల్లోని ఖగ్రాచారీ జిల్లాలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన దరిమిలా ఘర్షణలు చోటుచేసుకున్నాయి.ఈ హింసాకాండలో 13 మంది సైనిక సిబ్బంది, ముగ్గురు పోలీసులు గాయపడ్డారని ఢాకాలోని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖగ్రాచారీ జిల్లా కేంద్రంలో తొలుత  హింస చెలరేగింది. అక్కడి  చక్మా, మర్మ అనే ఆదివాసీ తెగలకు చెందినవారు శనివారం టైర్లు కాల్చివేస్తూ, చెట్ల కొమ్మలు, ఇటుకలను అడ్డుగా పెట్టి రోడ్డు దిగ్బంధనం చేశారు. దీంతో పోలీసు అధికారులు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షించారు. పోలీసులతో పాటు సైనిక, పారామిలిటరీ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)దళాలు గస్తీ నిర్వహించాయి. అయినప్పటికీ హింస  చెలరేగింది.

బాధిత బాలిక ట్యూషన్ నుండి తిరిగి వస్తుండగా  ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. అర్ధరాత్రి సమయంలో  ఒక నిర్మానుష్య ప్రదేశంలో అపస్మారక స్థితిలో పడివున్న బాలికను కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే ఆమెకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ నేపధ్యంలో పోలీసులు ఒక బెంగాలీ యువకుడిని అరెస్టు చేశారు. అతను అత్యాచారం చేసిన వారిలో ఒకడని  పోలీసులు అనుమానిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు  ఆ యువకుడిని విచారిస్తున్నారు. కాగా గుయిమారాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారని, వారి మృతదేహాలను ఖగ్రాచారీ ఆస్పత్రిలో ఉంచారని పోలీసు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ అహ్సాన్ హబీబ్ విలేకరులకు తెలిపారు.
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)