Breaking News

ధ్వంసమైన ఇరాన్‌ అణుకేంద్రాల సామర్థ్యం ఇదే..

Published on Sun, 06/22/2025 - 10:02

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య భీకరయుద్ధం జరుగుతోంది. తాజాగా అమెరికా టెహ్రాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌ అణుకేంద్రాలపై బాంబు దాడి చేయడం ద్వారా ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచింది. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య  జరుగుతున్న యుద్ధ వివాదంలో అమెరికా సైనిక జోక్యం తొలిసారిగా ఈ దాడులలో ప్రత్యక్షంగా కనిపించింది.

ట్రూత్ సోషల్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పోస్ట్‌లో అమెరికన్ విమానాలు విజయవంతమైన దాడిని పూర్తి చేశాయని పేర్కొన్నారు. ఇప్పుడు అన్ని విమానాలు ఇరాన్ వైమానిక స్థలం వెలుపల ఉన్నాయి. బాంబుల పేలోడ్‌ను ప్రాథమిక సైట్ అయిన ఫోర్డోలో ఉంచారు. విమానాలన్నీ సురక్షితంగా  తిరిగి వెళ్తున్నాయి. అమెరికన్ వారియర్స్‌కు అభినందనలు.  ఇంతటి సత్తాచాటిన సైన్యం ప్రపంచంలో మరోచోట లేదు. ఇప్పుడు శాంతికి సమయం వచ్చిందని ట్రంప్‌ అన్నారు.

ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా ఈ వివాదంలోకి ప్రవేశించాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి రెండు వారాల సమయం పడుతుందని  ట్రంప్‌ గతంలో చెప్పారు. అయితే ఇంతలోనే అమెరికా  ఈ దాడులను చేసింది. ఇజ్రాయెట్‌  గతవారం రోజులుగా ఇరాన్ అణు సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని, దాడులు కొనసాగిస్తోంది. తాజాగా అమెరికా సాగించిన దాడులలో ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయి.

ఫోర్డో అణు సామర్థ్యం
ఇరాన్‌లోని అత్యంత రక్షణతో కూడిన అణు కేంద్రం ఇది. ఇది ఒక పర్వతం కింద  ఉంది. ఫోర్డోను ఢీకొట్టేందుకు అమెరికా బీ-2 బాంబర్‌లను ఉపయోగించిందని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. ఫోర్డో అణు కేంద్రంలో దాదాపు మూడు వేల సెంట్రిఫ్యూజ్‌లను ఉంచగల సామర్థ్యం  ఉంది. వైమానిక దాడులను ఎదుర్కొనే సామర్థ్యంతో దీనిని నిర్మించారు.  2009లో కొన్ని విదేశీ నిఘా సంస్థలు ఈ ప్లాంట్‌ వివరాలను బహిర్గతం చేశాయి. ఫలితంగా ఇరాన్ అధికారికంగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) దీనిని బహిర్గతం చేయకతప్పలేదు.

నటాంజ్ అణు సామర్థ్యం
నటాంజ్.. టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక యురేనియం  నిల్వ కేంద్రం. ఈ కేంద్రం ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులకు గురైంది. 50 వేలకుపైగా సెంట్రిఫ్యూజ్‌లను ఇది నిర్వహిస్తోంది. చాలా కాలంగా అంతర్జాతీయ ఆందోళనకు కేంద్ర బిందువుగా నిలిచింది. వైమానిక దాడుల నుండి రక్షణ కల్పించేందుకు దీనిని భూగర్భంలో నిర్మించారు.

ఇస్ఫహాన్ అణు కేంద్రం
1984లో చైనా  సహకారంలో ఇస్ఫహాన్ సైట్ ఏర్పడింది. టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో  ఈ కేంద్రం ఉంది.  ఇది చైనా పరిశోధన రియాక్టర్లు, ప్రయోగశాలలకు నిలయంగా ఉంది. ఇరాన్ అణు కార్యక్రమంలో ఈ అణు కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ యురేనియం మార్పిడి కేంద్రం, అణు ఇంధన తయారీ కర్మాగారం ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ‘అంతర్జాతీయ చట్టానికి తూట్లు’.. అమెరికా దాడులను ధృవీకరిస్తూ ఇరాన్‌

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)