Breaking News

26/11 "ప్రజలపై కాల్పులు జరుపుతూ ఆనందిస్తున్నాడు"

Published on Wed, 11/26/2025 - 19:10

26/ 11 సరిగ్గా 17 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు యావత్ దేశం విషాదంతో నిండిపోయింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై పాక్ ఉగ్రమూకలు విరుచుకపడ్డది ఈ రోజే. అమాయకులైన ప్రజలపై కాల్పులు జరుపుతూ 166 మంది ప్రాణాలను పొట్టన బెట్టుకున్నారు. ఉగ్రదాడినుంచి తృటిలో తప్పించుకున్న దీవిక అనే బాధితురాలు ఆరోజు చేదు జ్ఞాపకాల్ని నేషనల్ మీడియాతో పంచుకున్నారు.

నవంబర్ 26  సరిగ్గా  17 ఏళ్ల క్రితం ఇదే రోజు జరిగిన ఉగ్రదాడి యావద్దేశాన్ని ఎంతగానో కలిచివేసింది. పాకిస్థాన్ నుంచి సముద్రమార్గం ద్వారా భారత్ వచ్చిన 10మంది ఉగ్రవాదులు హోటల్ తాజ్, ఒబెరాయ్, ఛత్రపతి మహారాజ్ టర్మినల్ రైల్వేస్టేషన్లలో చొరబడి అమాయక ప్రజలపై విచ్చల విడిగా కాల్పులు జరిపారు. 

ఆ ఘటనలో ప్రత్యక్ష బాధితురాలైన దీవిక మాట్లాడుతూ "ఆరోజు కసబ్ కాల్పులు జరుపుతున్న సమయంలో కసబ్ మోహంలో ఏమాత్రం భయం కనిపించలేదు. కాల్పులు జరుపుతూ ఆనందిస్తున్నాడు. ఆ మోహం ఇప్పటికీ నాకళ్లేదుటే మెదులుతుంది. ఆ కాల్పుల ఘటనను కళ్లారా చూసాను. నాకళ్లేదుటే చాలా మంది చనిపోయారు. ఆ రాత్రిని ఇప్పటికీ మరచిపోలేకపోతున్నాను. ప్రతి రోజు లెక్కబెట్టుకుంటూ గడుపుతున్నాను" అని ఆ భయానక రోజును గుర్తు చేసుకుంటూ ఆమె ఆవేదనకు లోనయ్యారు.  

కోర్టులో కసబ్ ను గుర్తించడానికి వెళ్లినప్పుడు  కసబ్ ను గుర్తించే ప్రయత్నంలో తనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని కానీ తాను ఆ రోజు కాల్పులు జరిపింది కసబ్ అని తేల్చి చెప్పానని అన్నారు.  ఆ రోజు జరిగిన ఉగ్రదాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300కు పైగా ప్రజలు గాయపడ్డారు. ఆరోజు జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఈ రోజు నివాళులర్పిస్తారు. 

ముంబై ఉగ్రదాడిలో మిగతా ఉగ్రవాదులంతా భారత బలగాలు జరిపిన కాల్పుల్లో మరణించగా అజ్మల్ కసబ్ ఒక్కరే ప్రాణాలతో పోలీసులకు పట్టుబడ్డాడు. కసబ్ ను 2012 నవంబర్ 21న రహస్యంగా ఉరి తీశారు.

#

Tags : 1

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)