ఉగ్రవాదానికి 20 వేలమంది భారతీయులు బలి: ఐక్యరాజ్యసమితిలో భారత్‌

Published on Sat, 05/24/2025 - 10:03

న్యూఢిల్లీ: గడచిన నాలుగు దశాబ్ధాలలో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడులకు 20 వేల  మందికిపైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి(United Nations)లో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపివేసిన దరిమిలా పాకిస్తాన్‌ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నదని ఐక్యరాజ్య సమితిలో భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.  

న్యూయార్క్‌లోగల ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన సభలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్‌ మాట్లాడుతూ పాకిస్తాన్‌(Pakistan) ఉగ్రవాదానికి  కేంద్రంగా ఉన్నదని, అది సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు విరమించే వరకూ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. పాకిస్తాన్‌ ఐక్యరాజ్యసమితిలో ఈ ఒప్పంద అంశాన్ని లేవనెత్తిన తర్వాత భారత్‌ ఘాటుగా స్పందించింది.
 

65 ఏళ్ల క్రితం భారత్‌ సింధు జలాల ఒప్పందంపై చిత్తశుద్ధితో సంతకం చేసిందని, అయితే పాకిస్తాన్‌ భారత్‌పై మూడు యుద్ధాలు జరిపి, లెక్కకుమించిన ఉగ్రవాద దాడులను చేయడం ద్వారా ఆ ఒప్పందపు స్ఫూర్తిని ఉల్లంఘించిందని హరీష్‌ పేర్కొన్నారు. గత నాలుగు దశాబ్దాలలో 20 వేల మందికి పైగా భారతీయులు ఉగ్రవాద దాడుల్లో మరణించాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం  ఎల్లప్పుడూ పాకిస్తాన్‌ విషయంలో అసాధారణ సహనం, ఉదారతను ప్రదర్శించిందని హరీష్‌ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: తోటి సైనికుని కాపాడబోయి.. ఆర్మీ అధికారి దుర్మరణం

Videos

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)