Breaking News

ఇరాక్‌పై దాడులు.. 20 మంది మృతి, మరో 32 మందికి గాయాలు

Published on Wed, 07/29/2026 - 17:15

బాగ్దాద్: ఇరాక్‌కు చెందిన పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ (పీఎంఎఫ్)పై అమెరికా-సౌదీ దాడుల్లో దాదాపు 20 మంది ఫైటర్స్‌ మరణించారు. మరో 32 మంది గాయపడ్డారు. తమ దళాలు పూర్తి అప్రమత్త స్థితిలో ఉన్నాయని పీఎంఎఫ్ ప్రకటించింది. టెలిగ్రామ్‌లో విడుదల చేసిన ప్రకటనలో పీఎంఎఫ్ స్పందిస్తూ.. "పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ ప్రధాన కార్యాలయాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సౌదీ అరేబియా, అమెరికా చేపట్టిన ద్రోహపూరిత ఉగ్రదాడిని ఖండిస్తున్నాం" అని పేర్కొంది.

పీఎంఎఫ్‌కు ఇరాన్ మద్దతు ఉంది. పీఎంఎఫ్‌ అనేది శిక్షణ పొందిన ఇరాకీ మిలీషియాల సమాఖ్య. ఈ దాడులు అత్యంత ప్రమాదకర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయని పీఎంఎఫ్ తెలిపింది. అంతేగాక, ఇవి ఇరాక్ సార్వభౌమాధికారంపై దాడితో పాటు అధికారిక భద్రతా సంస్థల ఉల్లంఘన అని ఆరోపించింది. 2026 ఏప్రిల్ 2న, ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో, మొసుల్ పశ్చిమ ప్రాంతంలో వైమానిక దాడుల్లో మరణించిన పీఎంఎఫ్ ఫైటర్‌ భౌతికకాయాన్ని బాగ్దాద్‌లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ సభ్యుడు మోస్తూ కనిపించాడు.

అమెరికా, సౌదీ అరేబియా సంయుక్తంగా విడుదల చేసిన వివరాల ప్రకారం.. అమెరికా దళాలు, సౌదీ చమురు కేంద్రాలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా మిలిటెంట్లపై ఇరాక్‌లో దాడులు చేపట్టాయి. సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్-మాలికీ కూడా ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్ర మిలీషియాలు సోమవారం, మంగళవారం ఇరాక్ భూభాగం నుంచి డ్రోన్లను ప్రయోగించి తూర్పు ప్రాంతం, రియాద్ ప్రాంతాల్లోని చమురు కేంద్రాలపై దాడులు చేశాయని ఆరోపించారు.

సౌదీ అరేబియా తన ఆత్మరక్షణ హక్కు ప్రకారం స్పందిస్తూ ఆ మిలీషియాలకు చెందిన నిర్దిష్ట లక్ష్యాలపై దాడులు నిర్వహించిందని ఆయన చెప్పారు. "సౌదీ అరేబియా రాజ్యం ఉద్రిక్తతలను కోరుకోవడం లేదు. అయితే తమపై జరిగే ఏ దాడికైనా కఠినంగా ప్రతిస్పందిస్తుంది" అని ఆయన అన్నారు. 

బుధవారం ఉదయం విడుదల చేసిన ప్రకటనలో, బాగ్దాద్, వాసిత్, నైనెవెహ్, బస్రా, కిర్కుక్, కర్బలా, దియాలా ప్రావిన్సుల్లోని తమ పలు ప్రధాన కార్యాలయాలపై అమెరికా-సౌదీ దాడులు జరిగాయని పీఎంఎఫ్ తెలిపింది. ఉత్తర ఇరాక్‌లోని నైనెవెహ్, మధ్య ఇరాక్‌లోని దియాలా ప్రాంతాల్లో జరిగిన దాడులే అత్యంత ప్రాణనష్టం కలిగించాయని ఒక అధికారి తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)