Breaking News

అఫ్గాన్‌లో వరదల బీభత్సం.. 20 మంది మృతి, 100 మంది గల్లంతు

Published on Tue, 07/21/2026 - 03:00

కాబూల్: అఫ్గానిస్తాన్‌ని భారీ వరదలు అతలాకుతలం చేశాయి. నిన్న (సోమవారం) నూరిస్తాన్ ప్రాంతంలో  సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా  20 మంది ప్రాణాలు కోల్పోయారు. , మరో 100 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ వివరాలను అక్కడి అధికారులు ప్రకటించారు.

భారీ వరదలకు నూరిస్తాన్  'పరూన్' లో నది ఒడ్డున  మార్కెట్లు, హోటళ్లు, వందలాది దుకాణాలు వరద ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయాయి. ఆ ప్రాంతంపూర్తిగా బురదతో నిండిపోయింది. దీంతో వరదలు తగ్గుముఖం పట్టాక క స్థానిక నివాసితులు బురద కుప్పలపై  గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలింపులు చేపడుతున్నారు. అయితే ఈ వరదలలో పరూన్ నగర మేయర్‌తో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

కాగా సహాయక చర్యలకు సరైన సామాగ్రి లేకపోవడంతో స్థానికులు తమ చేతులతోనే బురదను తొలగిస్తూ గాలింపు చర్యలు చేపట్టడం  హృదయవిదారకంగా కనిపిస్తోంది. కాగా ఈ ఘటనపై తాలిబన్‌ ప్రభుత్వం స్పందించింది.  ప్రభుత్వ ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ స్పందిస్తూ, నూరిస్తాన్ ప్రాంతంలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని బాధితులను రక్షించడానికి మరియు వారి ఆస్తులను కాపాడటానికి సంబంధిత ప్రభుత్వ సంస్థలు రంగంలోకి దిగి తీవ్రంగా శ్రమిస్తున్నాయని తెలిపారు.

భారీ వర్షాలు పడే అవకాశం

ఆ దేశ వాతావరణ పరిస్థితులపై విపత్తు నిర్వహణ సంస్థ  తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రావిన్సుల్లో భారీ వర్షాలు, తుఫానులు వచ్చే అవకాశం ఉన్నందున, ప్రజలు నదీ తీరాలకు వరద ముప్పు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.

#

Tags : 1

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)