Breaking News

జోర్డాన్‌లో ఇరాన్‌ క్షిపణుల మోత.. ఇద్దరు అమెరికా సైనికులు బలి

Published on Sun, 07/19/2026 - 00:54

అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం రద్దు కావడంతో పశ్చిమాసియాలో మళ్లీ పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. జోర్డాన్‌లో శుక్రవారం ఇరాన్ జరిపిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ల దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మరణించారు. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ధ్రువీకరించింది. 

మరో సైనికుడు ప్రస్తుతం గల్లంతైనట్లు సెంట్రల్ కమాండ్ తెలిపింది.  దీంతో ఈ యుద్దంలో ఇప్పటివరకు మరణించిన అమెరికా సైనికుల సంఖ్య 16కు చేరింది. అంతేకాకుండా 430 మందికి పైగా గాయపడ్డారు. కాగా ఇరాన్ తాజా దాడుల్లో గాయపడిన నలుగురు అమెరికా సైనికులను జోర్డాన్‌లోని ఆసుపత్రికి తరలిచారు.  వారు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు.

ఇరాన్ సుప్రీం లీడర్ హెచ్చరిక..
మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌పై దాడులను ఇలాగే కొనసాగిస్తే అమెరికాకు తగిన గుణపాఠం చెబుతామని ఎక్స్ వేదికగా ఖమేనీ పేర్కొన్నారు. కాగా ఇరాన్‌పై అమెరికా తమ దాడులను కొనసాగిస్తోంది. 

శనివారం తెల్లవారుజామున అమెరికా సైన్యం ఇరాన్‌లోని నిఘా కేంద్రాలు, సైనిక లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, ఆయుధ నిల్వలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఇది వరుసగా ఏడో రోజు కావడం గమనార్హం. దీనికి ప్రతికారంగా ఇరాన్.. వైట్, ఇరాక్, బహ్రెయిన్, జోర్డాన్, సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఎటాక్ చేస్తోంది.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)