Breaking News

అమెరికాలో కాల్పుల మోత

Published on Thu, 11/27/2025 - 07:09

వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్‌కు కొద్ది దూరంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై కాల్పులకు జరిగాయి. వీరిని వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ సభ్యులుగా గుర్తించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, వాషింగ్టన్ మేయర్ మురియెల్ బౌసర్ తెలిపారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కస్టడీలో ఉన్న అనుమానితుడికి కూడా ఈ ఘటనలో గాయాలయ్యాయి. అయితే అవి ప్రాణాపాయం కాని గాయాలని చట్ట అమలు అధికారులు తెలిపారు. అనుమానితుడి ఉద్దేశ్యం ఏమిటి? అతను గార్డ్ సభ్యులనే లక్ష్యంగా చేసుకున్నాడా? అనే విషయాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ఈ ఘటన గురించి గవర్నర్ పాట్రిక్ మోరిస్సే స్పందిస్తూ ‘దర్యాప్తు కొనసాగుతున్నందున మేము సమాఖ్య అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం’ అని అన్నారు.

చట్ట అమలు సంస్థలు సంఘటనా స్థలం నుండి సేకరించిన నిఘా వీడియోను సమీక్షిస్తున్నాయి. ఈ వీడియో ఆధారంగా అనుమానితుడు.. సైనికుల వద్దకు వచ్చి, తుపాకీని బయటకు తీసినట్లుగా తెలుస్తోంది. ఒక అధికారి చెప్పిన వివరాల ప్రకారం..సైనికులలో ఒకరు ఆ దాడి చేసిన వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ పరస్పర కాల్పుల ఫలితంగానే అనుమానితుడికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.

ఈ కాల్పుల ఘటన వైట్ హౌస్‌కు రెండు బ్లాక్‌ల దూరంలో జరిగింది. ఘటన జరిగిన వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలలో.. సైనికులలో ఒకరికి సీపీఆర్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు  కనిపిస్తోంది. మరొక సైనికుడికి, అదుపులో ఉన్న అనుమానితునికి కూడా చికిత్స అందిస్తున్న దృశ్యాలు ఆ వీడియోల్లో ఉన్నాయి. అలాగే ఆ దారిలో గాజు పెంకులు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టింది. ఎఫ్‌బీఐ కూడా సమాఖ్య స్థాయిలో దర్యాప్తులో పాలుపంచుకుంటోంది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)