Breaking News

హిజ్బుల్లాపై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడి

Published on Mon, 09/23/2024 - 21:32

హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ముమ్మరం చేసింది. సోమవారం ఒక్కరోజే 300 లకుపైగా లక్ష్యాలపై విరుచుకుపడింది. ఈ వైమానిక దాడుల్లో 182 మంది మృతి చెందినట్లు లెబనాన్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో 700 మందికి గాయాలైనట్లు పేర్కొంది.

ఈ రోజు ఉదయం నుండి దక్షిణ పట్టణాలు, గ్రామాలపై ఇజ్రాయెల్‌ దాడి చేసింది. ఈ దాడుల్లో 182 మంది మరణించారు. వారిలో పిల్లలు, మహిళలు,మెడికల్‌ సిబ్బంది ఎక్కువ మంది ఉన్నట్లు లెబనాన్‌ ఆరోగ్యశాఖ ప్రతినిధులు ప్రకటించారు.  

ఈ దాడులపై ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి స్పందించారు. లెబనాన్‌లోని సామాన్య ప్రజలు హిజ్బుల్లాకు అనుసంధానంగా ఉన్న ప్రదేశాల నుంచి దూరంగా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరించారు. అంతేకాదు తమ సైన్యం లెబనాన్ అంతటా విస్తరించిన హిజ్బుల్లా ఖచ్చితమైన స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుందని హగారి స్పష్టం చేశారు. లెబనాన్‌ పౌరులు భద్రత దృష్ట్యా వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. 

చదవండి : పడవలో కుళ్లిన 10 మృతదేహాలు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)