అమెరికాలో తుపాను బీభత్సం.. 17 మంది దుర్మరణం

Published on Sun, 03/16/2025 - 07:32

ఓక్లహామా సిటీ (యూఎస్‌): అమెరికా(America)లో ప్రకృతి ప్రకోపించి 17 మంది ప్రాణాలను బలితీసుకుంది. కొన్ని రాష్ట్రాలు పెను తుపాను బారినపడితే మరికొన్ని చోట్ల టోర్నడోలు విజృంభించాయి. మరికొన్ని చోట్ల కార్చిచ్చు ఘటనలు స్థానికులను కకావికలం చేస్తున్నాయి. మిస్సోరీ రాష్ట్రంలో టోర్నడో కారణంగా 11 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి అర్కాన్సాస్‌లో ముగ్గురు, టెక్సాస్‌లో సిటీలో దుమ్ము తుపాను కారణంగా జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు.

దేశవ్యాప్తంగా 16 కౌంటీలలో పలు ఇళ్లు, వ్యాపార సంస్థ నష్టం వాటిల్లిందని, విద్యుత్ లైన్లు  దెబ్బతిన్నాయని, చెట్లు కూలిపోయాయని అర్కాన్సాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ(Arkansas Department of Public Safety) ఒక ప్రకటనలో తెలిపింది. టెక్సాస్ పాన్‌హ్యాండిల్‌లోని అమరిల్లో కౌంటీలో చోటు చేసుకున్న కారు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు. మిస్సౌరీలోని బేకర్స్‌ఫీల్డ్ ప్రాంతంలో తుఫానుల కారణంగా ఇద్దరు మరణించారని, పలువురు గాయపడ్డారని మిస్సౌరీ స్టేట్ హైవే పెట్రోల్ తెలిపింది. ఈ నేపధ్యంలో స్థానికులు సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లాలని అధికారులు సూచించారు.

బేకర్స్‌ఫీల్డ్‌కు తూర్పున 177 మైళ్ల దూరంలోని ఒక ఇంటిని సుడిగాలి చుట్టుముట్టడంతో, ఒకరు మృతి చెందారని,  మరో మహిళను  రెస్క్యూ టీమ్‌ రక్షించిందని అధికారులు తెలిపారు. అర్కాన్సాస్‌లోని కేవ్ సిటీ ప్రాంతంలో టోర్నడో కారణంగా ఐదుగురు గాయపడ్డారని,  ఈ నేపధ్యంలో అత్యవసర పరిస్థితి విధించినట్లు మేయర్ జోనాస్ ఆండర్సన్ తెలిపారు. 

ఇది కూడా చదవండి: హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా దాడి.. 9 మంది మృతి
 

#

Tags : 1

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)