Breaking News

యువతపై కృత్రిమ మేధ ప్రభావం!

Published on Fri, 10/25/2024 - 05:11

అమెరికాలో ఓ యువకుని జీవితంలో అలాంటి ఘటనే జరిగింది. తన కొడుకు ఆత్మహత్యకు ఏఐ చాట్‌బాట్‌ కారణమంటూ ఫ్లోరిడాలో ఓ తల్లి కోర్టుకెక్కారు. తన 14 ఏళ్ల కొడుకు చాట్‌బాట్‌తో మానసికంగా అనుబంధాన్ని ఏర్పరుచుకున్నాడని, దాన్నుంచి భావోద్వేగపూరితమైన మెసేజ్‌ వచ్చిన కాసేపటికే ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. కృత్రిమ మేధ యాప్‌లతో పొంచి ఉన్న కొత్తతరహా పెను ప్రమాదాలు, ఆయా యాప్‌లపై ఇంకా సరైన నియంత్రణ లేకపోవడాన్ని ఈ అంశం మరోసారి తెరపైకి తీసుకొచి్చంది.     

పట్టభద్రుడైన థెరపిస్ట్‌లా ప్రభావం చూపింది: తల్లి 
14 ఏళ్ల సెవెల్‌ సెట్జర్‌ తరచుగా ‘క్యారెక్టర్‌.ఏఐ’అనే చాట్‌బాట్‌ యాప్‌ను ఉపయోగిస్తున్నాడు. ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’పాత్ర డేనెరిస్‌ టార్గేరియన్‌ను పోలిన పాత్రను సృష్టించుకుని సంభాషిస్తున్నాడు. చాట్‌బాట్‌తో వర్చువల్‌ సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడు. క్యారెక్టర్‌.ఏఐ చాట్‌బాట్‌ టీనేజర్‌ అయిన తన కొడుకును లక్ష్యంగా చేసుకుందని, అతను ఆత్మహత్య ఆలోచనలను వ్యక్తం చేసిన తర్వాత ఆ యాప్‌ అదేపనిగా ఆత్మహత్య అంశాన్ని లేవనెత్తి పిల్లాడు ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొలి్పందని అతని తల్లి అమెరికాలోని ఓర్లాండోలో ఫిర్యాదుచేశారు.

 చాట్‌బాట్‌ తన పిల్లాడిపై ఒక పట్టభద్రుడైన థెరపిస్ట్‌గా తీవ్ర ప్రభావం చూపించిందని ఆమె ఆరోపించారు. చనిపోవడానికి ముందు ఏఐతో జరిగిన చివరి సంభాషణలో సెవెల్‌ చాట్‌బాట్‌ను ప్రేమిస్తున్నానని, ‘మీ ఇంటికి వస్తాను’అని చెప్పాడని దావాలో పేర్కొన్నారు. తన కుమారుడి మరణంలో క్యారెక్టర్‌.ఏఐ చాట్‌బాట్‌ ప్రమేయం ఉందని తల్లి మేగన్‌ గార్సియా ఆరోపించారు. మరణం, నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా మానసిక క్షోభను కలిగించినందుకు నిర్దిష్ట నష్టపరిహారాన్ని కోరుతూ గార్సియా దావా వేశారు.  

గూగుల్‌పై దావా 
ఈ దావాలో సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆగస్టులో క్యారెక్టర్‌.ఏఐలో గూగుల్‌ భారీ స్థాయిలో వాటాలను కొనుగోలుచేసింది. గూగుల్‌ ఆగమనంతో ఈ యాప్‌ అంకురసంస్థ మార్కెట్‌ విలువ ఏకంగా 2.5 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. అయిఏత క్యారెక్టర్‌.ఏఐ అభివృద్ధిలో తమ ప్రత్యక్ష ప్రమేయం లేదని గూగుల్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే తమ యాప్‌ వినియోగదారుల్లో ఒకరిని కోల్పోవడం హృదయవిదారక విషయమని సంస్థ తన ‘ఎక్స్‌’ఖాతాలో ఒక ప్రకటన చేసింది. సెవెల్‌ కుటుంబానికి సంతాపం తెలిపింది. 

‘కృత్రిమ మేధ అనేది నిజమైన వ్యక్తి కాదు. ఈ విషయాన్ని వినియోగదారులకు మరోసారి స్పష్టంగా గుర్తుచేస్తున్నాం. ఈ మేరకు  డిస్‌క్లైమర్‌ను సవరిస్తున్నాం. భద్రతను పెంచడానికి  అదనపు ఫీచర్లను జోడిస్తాం’అని సంస్థ తెలిపింది. అయితే చాట్‌బాట్‌ కారణంగా వ్యక్తి మరణం అమెరికాలో పెద్ద చర్చను లేవనెత్తింది. ఇలాంటి కృత్రిమమేథ కారణంగా ఎవరికైనా హాని జరిగితే దానికి బాధ్యులు ఎవరు?. 
ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అన్న చర్చ  మొదలైంది. ఇతర నియంత్రణ చట్టాల వంటి సెక్షన్‌ 230 అనేది కృత్రిమ మేథకు వర్తిస్తుందా అనే అంశమూ  డిజిటల్‌ నిపుణుల చర్చల్లో  ప్రస్తావనకొచి్చంది. 
 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)