Breaking News

Pakistan: టీటీపీ ఉగ్రవాదులతో ఘర్షణ.. 11 మంది సైనికులు మృతి

Published on Wed, 10/08/2025 - 17:13

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన నిఘా ఆధారిత ఆపరేషన్‌లో నిషేధిత తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)కు చెందిన 19 మంది ఉగ్రవాదులు, 11 మంది సైనికులు మరణించారని పాక్‌ సైన్యం తెలిపింది. అక్టోబర్ 7-8 మధ్య రాత్రి ‘ఫిట్నా అల్-ఖవారీజ్’ అనే బృందంలో ఉగ్రవాదులు ఉన్నారనే నివేదికల నేపథ్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించామని సైనిక మీడియా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 19 మంది ఉగ్రవాదులు మరణించారని, లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ సహా 11 మంది పాకిస్తాన్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారని సైనిక విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో ఇంకావున్న ఉగ్రవాదులను నిర్మూలించేందుకు శానిటైజేషన్ ఆపరేషన్ కొనసాగుతున్నదని పేర్కొంది. నిషేధిత టీటీపీ ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్‌లోని భద్రతా దళాలు, పోలీసులు, చట్ట అమలు సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది.

సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ (సీఆర్‌ఎస్‌ఎస్‌) తాజా గణాంకాల ప్రకారం 2025 మూడవ త్రైమాసికంలో టీటీపీ దాడులకు గురైన అత్యంత ప్రభావిత ప్రాంతంగా ఖైబర్ పఖ్తుంఖ్వా నిలిచింది. హింసాత్మక ఘటనల్లో 221కు పైగా జనం మరణించారు. ఆఫ్ఘనిస్తాన్‌తో పోరస్ సరిహద్దులను పంచుకునే ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ రెండూ ఉగ్రవాద దాడులను ఎదుర్కొంటున్నాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)