Breaking News

109 ఏళ్లలోనూ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌..‘వావ్‌ తాత, ఏం ఆ ఎనర్జీ’

Published on Sun, 05/07/2023 - 21:15

మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ సినిమాలో ప్రభాస్‌ ఎంత ఫిట్‌గా ఉంటాడో, అంతే ఫిట్‌గా ఉంటాడు ఈ శత వృద్ధుడు. పేరు విన్సెంట్‌ డ్రాన్స్‌ఫీల్ట్‌. అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటాడితను. చూడటానికి అరవై, డెభై ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తాడు. కానీ, నిజానికి ఇతని వయసు 109 సంవత్సరాలు. ఇప్పటికీ కారు నడుపుతాడు. కళ్లజోడు లేకుండానే న్యూస్‌ పేపర్‌ చదువుతాడు. చేతికర్ర లేకుండానే ట్రాఫిక్‌లో వెళ్లి ఇంటికి అవసరమైన వస్తువులు, సరుకులు తీసుకొస్తాడు. తన వ్యక్తిగత పనులన్నీ తానే స్వయంగా చేసుకుంటాడు. అప్పుడప్పుడు ఇంటి పనుల్లోనూ సహాయం చేస్తుంటాడు.

ఈ వయసులోనూ ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏమిటని అడగ్గా.. విన్స్‌ ఏడుగురు మనవరాళ్లలో ఒకరు ఇలా అన్నారు: ‘విన్స్‌ 21 ఏళ్ల వయసులో అగ్నిమాపక సహాయ కేంద్రంలో ఉద్యోగంలో చేరి, ఈ మధ్యనే రిటైర్‌ అయ్యాడు. దాదాపు 80 యేళ్ల పాటు అదే ఉద్యోగాన్ని కొనసాగిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడాడు. వారి దీవెనలే అతన్ని ఆరోగ్యంగా ఉంచాయి’. ఇదే విషయాన్ని అతని ఒక్కగానొక్క కూతురు, ముగ్గురు మనవళ్లు, ఏడుగురు మనవరాళ్లు కూడా న మ్ముతున్నారు. విన్స్‌ మాత్రం తన ఆరోగ్య రహస్యం రోజూ ఒక గ్లాసు పాలు తాగడం, శరీరాన్ని నిరంతరం కదిలించడమే అని అంటున్నాడు.  
చదవండి: చెరువులో వింత జీవి.. వామ్మో ఇరవై నాలుగు కళ్లు..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)