Breaking News

మ్యూజియంలో దొంగలు పడ్డారు

Published on Sat, 11/01/2025 - 05:14

ఓక్‌లాండ్‌ (కాలిఫోర్నీయా): అమెరికాలో చారిత్రక ప్రాధాన్యమున్న దాదాపు 1000 వస్తువులను దుండగులు అపహరించారు. కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌ మ్యూజియం నుంచి ఈ నెల 15న ఈ వస్తువులను అపహరణకు గురైనట్లు పోలీసులు తెలిపారు. చోరీకి గురైన వస్తువులు కాలిఫోర్నీయా చరిత్రకు సాక్ష్యాలుగా భద్రపర్చబడ్డవి అని పేర్కొన్నారు. 

ఈ చోరీపై దర్యాప్తు జరుగుతోందని మ్యూజియం డైరెక్టర్‌ లోరీ ఫోగర్టీ తెలిపారు. దొంగలు ఆ వస్తువులను ఎక్కడైనా విక్రయించటానికి ప్రయతి్నస్తే తమకు సమాచారం అందించాలని పురాతన వస్తువులను విక్రయించే మార్కెట్లు, దుకాణాదారులకు విజ్ఞప్తి చేశారు. ‘వారు కొల్లగొట్టింది మ్యూజియాన్ని మాత్రమే కాదు. ప్రజల సంపదను కొల్లగొట్టారు. మన సమాజాన్ని కొల్లగొట్టారు. 

వాటిని తిరిగి తెచ్చేందుకు ప్రజలు సహకరిస్తారని ఆశిస్తున్నాం’అని లోరీ గురువారం ఆశాభావం వ్యక్తంచేశారు. చోరీకి గురైన వస్తువుల్లో మెటల్‌ వర్క్‌ ఆభరణాలు, అమెరికా మూలవాసులు ఉపయోగించిన బుట్టలు, గతంలో కాలిఫోర్నీయా వాసులు నిత్యజీవితంలో వినియోగించిన వస్తువులు, అథ్లెటిక్స్‌ ట్రోఫీలు తదిర విలువైన వస్తువులు ఉన్నాయి.

 ‘దుండగులు భవనంలోకి ప్రవేశించి కనిపించిన వస్తువునల్లా తీసుకొని వచ్చిన దారినే వెళ్లినట్లు కనిపిస్తోంది’అని లోరీ తెలిపారు. చోరీకి గురైనవాటిలో ప్రముఖ లోహవస్తువుల కళాకారుడు ఫ్లోరెన్స్‌ రెస్నికోఫ్‌ రూపొందించిన అందమైన ఆభరణాలతోపాటు నగిషీలు చెక్కిన వాల్‌రస్‌ (సముద్ర జంతువు) దంతాలు ఉన్నాయి. చాలా వస్తువులు కాలిఫోర్నీయా 20వ శతాబ్దపు చరిత్రను తెలియజేసేవేనని లోరీ తెలిపారు.  

వాటిని ఇప్పటికే అమ్మేసి ఉంటారు 
చోరీ జరిగి ఇప్పటికే రెండు వారాలు గడిచిపోయినందున దొంగలు వాటిని ఎక్కడో ఓ చోట అమ్మేసి ఉంటారని లాస్‌ఏంజెల్స్‌ పో లీస్‌ విభాగంలో కెపె్టన్‌గా పనిచేసి రిటైరైన జాన్‌ రోమెరో అభిప్రాయపడ్డారు. దర్యాప్తు అధికారులు వాటికోసం వస్తువుల రీసేట్‌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లైన ఈబే, క్రెయిగ్స్‌లిస్ట్‌తోపాటు చారిత్రక ప్రాధాన్యమున్న వస్తువులను సేకరించే దుకాణాల్లో వెదకాలని సూచించారు. ‘దోపిడీ చేసినవారు వాటిని అమ్మేసి వెంటనే డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవారు. వాటి విలువ తెలిసినవారు కాదు’అని పేర్కొన్నారు. 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు