Breaking News

మద్యం షాపులపై నజర్‌

Published on Wed, 10/25/2023 - 08:22

బంజారాహిల్స్‌: ఎన్నికల అధికారులు ఇచ్చే ఆదేశాలను పాటించే క్రమంలో పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహం ప్రజల పాలిట శాపంగా మారుతున్నది. గత రెండు వారాల నుంచి పోలీసులు తమ పరిధిలోని వైన్‌షాపులు, బ్యాంకులు, ఆభరణాల దుకాణాలు, దుస్తుల దుకాణాల వద్ద తిష్టవేస్తూ బ్యాంకులో డిపాజిట్‌ చేయడానికి వచ్చిన డబ్బులను, వైన్‌ షాపుల నుంచి నాలుగు బాటిళ్లకు మించి తీసుకెళ్తున్న మద్యాన్ని సీజ్‌ చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

తాజాగా ఓ యువకుడు దసరా సందర్భంగా తన ఇంట్లో విందు కోసం సోమవారం సాయంత్రం 6 మద్యం సీసాలు, 20 బీర్లు తీసుకుని వెళ్తుండగా అప్పటికే అక్కడ తిష్టవేసిన పోలీసులు ఆయన వెళ్తున్న దారిలో కొద్ది దూరం అనుసరించి..కారును ఆపి మద్యం సీజ్‌ చేయడమే కాకుండా ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. ఇదేమిటని ఆ యువకుడు ప్రశ్నించగా నువ్వు ఓటర్లకు పంచడానికే మద్యం తీసుకెళ్ళుతున్నావంటూ పోలీసులు జవాబు ఇవ్వడంతో ఆ యువకుడు నోరెళ్లబెట్టాడు. ఇలా ప్రతి వైన్‌షాపు వద్ద పోలీసులు తిష్టవేస్తూ ఓవర్‌ యాక్షన్‌కు దిగుతున్నారు.

ఎవరు ఎంత మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారో నిఘా వేసి వారు కొద్ది దూరం వెళ్లాక ఆపి మద్యాన్ని సీజ్‌ చేసి దాన్ని ఎన్నికల లెక్కల్లో చూపిస్తున్నారు. అంతే కాదు..మద్యం దుకాణాలు, ఆభరణాల దుకాణాలు, దుస్తుల షాపుల యజమానులు రాత్రి షాపు బంద్‌ చేసి ఆ రోజు కలెక్షన్‌ తీసుకెళ్లాలనుకున్నా అక్కడ మఫ్టీలో నిఘా ఉంటున్న పోలీసులు వారిని వేటాడి వెంబడిస్తున్నారు. చాలా మంది షాపుల యజమానులు తమ రోజువారీ వసూలు చేసిన డబ్బులను బ్యాంకుల్లో జమ చేయలేని పరిస్థితులు తలెత్తున్నాయి.

ప్రతి రోజూ ప్రతి పోలీసు స్టేషన్‌ పరిధిలో ఒక లిక్కర్‌ కేసు నమోదు చేయాలని ఇటీవల ఉన్నతాధికారులు టార్గెట్‌ విధించారు. దీంతో పోలీసులు ఠాణాలను వదిలి వైన్‌షాపుల వద్ద తిష్టవేయాల్సిన పరిస్థితులు తలెత్తున్నాయి. ఇంకా ఎన్నికలకు ఆరువారాల సమయం ఉండగా ఇప్పటి నుంచి ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తారని అధికారులు ఎలా భావిస్తున్నారో ఆ దేవుడికే తెలియాలి.

మొత్తానికి అటు వ్యాపారులు, ఇటు ప్రజలు పోలీసుల తీరుతో విసిగిపోతున్నారు. చాలా చోట్ల తీవ్ర వాగ్వాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పోలీసుల తీరును చాలా చోట్ల జనం ఎండగడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ అనాలోచిత, అసమర్థ నిర్ణయాలపై పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)