Breaking News

‘సండే సినిమా’@ 200 వీక్స్‌

Published on Mon, 03/20/2023 - 04:36

సాక్షి, సిటీబ్యూరో: దేశ సినీరంగ పరిశ్రమలో ప్రస్తుత తెలుగు సినిమా స్థాయికి పునాది వేసింది ఆనాటి సామాజిక విలువల్ని, నటనా కౌశలాన్ని ప్రతిబింబించిన సినిమాలే. ప్రస్తుతం సక్సెస్‌, బిజినెస్‌, స్టార్‌ ఇమేజ్‌ మాయలో పడిపోయి సినిమా ఆత్మ, ఆర్థత కోల్పోతోంది. ఇలాంటి తరుణంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైన ఉత్తమ చిత్రాలను తెలుగు సినీ ప్రేమికులకు చేరవేసేందుకు 2018 జనవరి 7వ తేదీన ‘సండే సినిమా’ (ఎ విండో టూ వరల్డ్‌ సినిమా) కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా రవీంద్రభారతి వేదికగా పైడి జయరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌లో ప్రదర్శిస్తున్న ఉత్తమ చిత్రాలు నేటితరం యువ దర్శకులకు కొత్త ఆలోచనా ధోరణిని పెంపొందిస్తూ స్థానిక కథలను సినిమాలుగా రూపొందించుకునేలా ప్రభావితం చేస్తున్నాయి. నూతన దర్శకులను, రచయితలను, టెక్నీషియన్లను మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమా వైపు నడిపించడంలోనూ ఈ ‘సండే సినిమా’కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నెల 12వ తేదీన ‘డ్రీమ్స్‌’ సినిమాతో 200 వారాలను సండే సినిమా పూర్తి చేసుకుంది. కార్యక్రమం చేపట్టిన తర్వాత రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రోత్సాహంతో స్థానిక యువ సినీ ప్రేమికులు వినూత్న కథాంశాలతో సినిమాలు రూపొందించి ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన స్థితిగతులే ఆధారంగా సినిమాలను తెరకెక్కించి ప్రతిభను ప్రపంచానికి చూపిస్తున్నారు.

రవీంద్ర భారతిలో 2018 జనవరి 7 నుంచి రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ చిత్రాల ప్రదర్శన

తెలుగు సినిమా సాంస్కృతిక పునర్‌వైభవానికి కృషి

ఈ మట్టిని ముట్టుకుంటే కథ వస్తది..

‘తెలంగాణ మట్టిని ముట్టుకుంటే కథ వస్తది.. మనిషిని ముట్టుకుంటే సినిమా అయితది’..! మూస ధోరణిలో సినిమాలు, షార్ట్‌ఫిల్మ్‌లు తీసున్న యువ సినీ ఔత్సాహికులకు మంచి కథాంశాలను చూపించాలన్న ఉద్దేశ్యంతో సండే సినిమాను ప్రారంభించాం. ప్రపంచ సినిమా చరిత్రను, గమనాన్ని మార్చిన సినిమాలు ప్రదర్శించాం. నిపుణులతో ఆ సినిమాలపై చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యూట్యూబ్‌, ఫేస్‌ బుక్‌ ద్వారా ఇతర ప్రాంతాల్లోని సినీ అభిమానులకు చేరవేస్తున్నాం. నవతరం దర్శకులు ఈ వేదిక నుంచి స్ఫూర్తి పొందుతూ.. మూలకథ, స్క్రీన్‌ ప్లే, ఎమోషన్‌, సీనిక్‌ ఆర్డర్‌ తదితర అంశాల్లో అవగాహన పొంది వినూత్నమైన లఘుచిత్రాలు, సినిమాలు రూపొందిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సినిమాలు చూపించేందుకు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ముందుంటుంది. – మామిడి హరిక్రిష్ణ,

తెలంగాణ భాషా సాంస్కృతిక సంచాలకులు

Videos

Prasanna Kumar: ఎన్ని కుట్రలు, కుతంత్రాలైనా చేసుకో సింహం నెల్లూరులో దిగుతుంది..

Patancheru: గుర్తుపట్టని స్థితిలో మృతదేహాలు

త్వరలోనే 2.0 పాదయాత్ర కార్యకర్తల్లో జోష్ పెంచిన జగన్

పార్టీ స్థాపించినప్పుడు ఉన్నది నేను,అమ్మా మాత్రమే...

ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడి ప్రకటన సభలో నేతల అసంతృప్తి

సింగయ్య కేసుపై ఏపీ హైకోర్టు స్టే.. పొన్నవోలు రియాక్షన్..

ఏపీ హైకోర్టులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట

Singayya Incident: వైఎస్ జగన్ పై విచారణకు స్టే విధించిన ఏపీ హైకోర్టు

Tadepalli: పార్టీ యువజన విభాగం నేతలతో YS జగన్ భేటీ

Pashamylaram Incident: మృతుల కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహారం

Photos

+5

ఈ ఏడాది చాలా స్పెషల్.. పెళ్లి రోజు సెలబ్రేట్‌ చేసుకున్న మహాతల్లి జాహ్నవి..!

+5

ఔరా..! అనిపించే ఆరోవిల్లే టూరిజం..! ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే పర్యాటక ప్రదేశం

+5

'అట్లీ' సినిమా కోసం ముంబై బయల్దేరిన అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

విశాఖపట్నం : సాగరతీరంలో సందర్శకుల సందడి (ఫొటోలు)

+5

‘ప్రేమిస్తున్నా’ చిత్రం సాంగ్‌‌‌‌ లాంచ్ (ఫోటోలు)

+5

నితిన్ 'తమ్ముడు' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మావాళ్లు ఎక్కడ?.. పాశమైలారం ఘటన.. హృదయ విదారకం (చిత్రాలు)

+5

అందమైన 'కోయిల'గా దేత్తడి హారిక (ఫోటోలు)

+5

ఆనంద్ మహీంద్రా మెచ్చిన వ్యాలీ..! ప్రకృతిలో దాగున్న అద్భుత ప్రదేశం..

+5

డార్లింగ్‌ సామ్‌తో లంచ్‌ చేసిన కీర్తి సురేశ్‌ (ఫోటోలు)