Breaking News

భారత విప్లవ ప్రతీక!

Published on Fri, 09/27/2024 - 12:27

భారతదేశం గర్వించే వీర కిశోరం భగత్‌ సింగ్‌. నేటి పాకిస్తాన్‌లో ఉన్నపంజాబ్‌ రాష్ట్రంలో 1907 సెప్టెంబర్‌ 27న జన్మించాడు. చిన్నతనంలో తన బాబాయి సర్దార్‌ అజిత్‌ సింగ్‌ ఆంగ్లేయులతో పోరాడుతూ... పట్టుబడకుండా ఉండేందుకు విదేశాలలో ఉండేవాడు. ఆ సమయంలో కంటనీరు పెట్టుకొనే చిన్నమ్మను చూసి ‘పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లే యులపై ప్రతీకారం తీర్చుకుంటా’ అంటూ ఉండేవాడు.

గాంధీ, నెహ్రుల సారథ్యంలో నడుస్తున్న స్వాతంత్రోద్యమంలో చిన్ననాటి నుండే చురుకుగా పాల్గొంటూ వస్తున్న భగత్‌ సింగ్‌కు స్వాతంత్య్రం యాచిస్తే రాదనీ, శాసిస్తేనే వస్తుందని గ్రహించాడు. రష్యా విప్లవ సాహిత్యాన్ని అధ్యయనం చేసి, గాంధీ కోరిన స్వాతంత్య్రం అంటే తెల్లదొరలు పోయి నల్లదొరలు రావడమేనని అర్థం చేసుకున్నాడు. అందుకే  ముందు సోషలిస్టు సమాజం నిర్మించాలని తలంచి తను పనిచేస్తున్న హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌ను, హిందు స్థాన్‌ సోషలిస్టు రిపబ్లికన్‌ అసోషియేషన్‌గా మార్చాడు.

బ్రిటిష్‌ వాళ్లు సాగిస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా నినదించే గొంతులు ఈ దేశంలో ఉన్నాయని తెలియచేసేందుకు కేంద్ర శాసనసభలో బాంబువేసి పారిపోకుండా ‘సామ్రాజ్యవాదం నశించాలి, విప్లవం వర్ధిల్లా ల’నే నినాదాలను చేశాడు భగత్‌ సింగ్‌. జలియన్‌ వాలాబాగ్, చౌరీచౌరా ఘటనలు భగత్‌ సింగ్‌లో స్వాతంత్య్ర కాంక్షను రగిలిస్తే; సైమన్‌ కమిషన్‌ పర్యటన సమయంలో దెబ్బలు తిన్న కారణంగా లాలా లజపతిరాయ్‌ మరణించడం ప్రతీకారేచ్ఛను కలిగించింది.

భగత్‌ సింగ్‌ను బ్రిటిష్‌వాళ్లు ఉరితీసే కొద్ది రోజుల ముందు ఆయన తండ్రి క్షమాభిక్ష కోసం బ్రిటిష్‌ వారికి ఉత్తరం రాశారు. తన మరణం బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని కూలదోయగలదనే  విశ్వాసం తనదనీ, అందువల్ల బ్రిటిష్‌ వాళ్లకు చేసిన అభ్యర్థనను వెనక్కి తీసుకోవాలనీ కోరాడు భగత్‌. అదీ ఆ వీరుని దేశభక్తి! – జి. పవన్‌ కుమార్‌, బిజ్వార్‌

ఇవి చదవండి: సీఎం సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)