Breaking News

Konda Laxman Bapuji: ఉద్యమాల కొండ..

Published on Fri, 09/27/2024 - 12:30

తెలంగాణ ప్రాంతానికి దాస్య విముక్తి కల్పించిన నాయకుల్లో కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఒకరు. ఆదిలాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ తాలూకాలోని  వాంకిడి అనే కుగ్రామంలో ఒక నిరు పేద చేనేత కుటుంబంలో 1915 సెప్టెంబర్‌ 27న బాపూజీ జన్మించారు. భూమికోసం, భుక్తికోసం, నిజాం సంస్థానంలో సుదీ  ర్ఘకాలం కొనసాగిన సంగ్రామంలో జనానికి అండగా నిలిచారు. ఆయన ఇచ్చిన ‘జై తెలంగాణ‘ నినాదం ప్రజాబాహుళ్యాన్ని జాగృత పర్చింది.

1938లో తాను మెట్రిక్యులేషన్‌ చదువుతున్న ప్పుడే హైద్రాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌లో చేరి పౌర హక్కుల ఉద్యమం, వందేమాతర ఉద్యమం, ఆంధ్ర మహా సభల్లో క్రియాశీలక పాత్ర పోషించి పలువురు జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించారు. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమంలో ఆబిడ్స్‌ పోస్ట్‌ ఆఫీసుపై, కోఠిలో ఉన్న బ్రిటిష్‌ రెసిడెన్సీపై జాతీయ జెండా ఎగురవేసి సంచలనం సృష్టించారు. నవాబుల పాలనలో నలిగి పోతున్న ప్రజానీకాన్ని రక్షించాలంటే మీర్‌–ఉస్మాన్‌ అలీఖాన్‌ను అంతమొందించడం ఒక్కటే మార్గమని భావించి షోలాపూర్, బొంబాయి, అహ్మదా బాద్‌లలో ‘పహాడీ’ (కొండ) పేరుతో ప్రచ్ఛన్న కార్యకలాపాలు నిర్వహించి నిజాం రాజుపై బాంబు దాడికి వ్యూహం రచించారు.

రెండు దఫాలు మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించారు. ముల్కీ ఉద్యమం నుండి మొన్నటి తెలంగాణ ఉద్యమం దాక  ముందుండి నడిపించారు. కార్మికులను, చేతివృత్తుల వారిని సమీకరించి సహకార రంగం పరిధి లోకి తీసుకొచ్చారు. బీసీల స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కాకా కాలేల్కర్‌ కమిటీ, మండల కమిషన్‌లకు జనాభా దామాషా ప్రకారం రేజర్వేషన్లతో పాటు రాజ్యాధికారంలో బీసీలకు వాటా దక్కేలా చూడాలని నివేదించారు. ప్రభుత్వాలు సమగ్ర కుల గణన చేపట్టి ఆ దిశలో ముందడుగు వేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి. – డా. వంగర భూమయ్య, పాలమూరు విశ్వవిద్యాలయంలో సహాయాచార్యులు

ఇవి చదవండి: భారత విప్లవ ప్రతీక!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)