Breaking News

చరిత్రలో మాయని మచ్చలు..

Published on Tue, 08/06/2024 - 13:55

జపాన్‌లోని హిరోషిమా నగరంపై 1945 ఆగస్టు 6న,  నాగసాకిపై ఆగస్టు 9న అమెరికా జారవిడిచిన అణుబాంబులు సుమారు 2 లక్షలకుపైగా పౌరులను బలి తీసు కున్నాయి. ఇవి చరిత్రలో మాయని మచ్చలు, అతిపెద్ద దుస్సంఘటనలు. అయినా దేశాలు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు. ఒక్క క్షణంలో ప్రపంచాన్ని భస్మీ పటలం చేసే అణ్వాయుధాలను పోగేస్తూనే ఉన్నాయి.

‘స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ (సిప్రి) 2024 నివేదిక, అమెరికా వద్ద 5,044 అణ్వా యుధాలు ఉన్నట్టు తెలిపింది. అదే నివేదిక ప్రకారం, రష్యా దగ్గర 5,580, ఫ్రాన్స్ దగ్గర 290, చైనా దగ్గర 500, బ్రిటన్‌ దగ్గర 225, భారత్‌ దగ్గర 172 అణ్వాయుధాలు ఉన్నాయి. పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్‌ కూడా అణుసంపత్తిని కలిగి ఉన్నాయి. పైగా ఈ దేశాలన్నీ తమ అణ్వాయుధాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. చైనా దగ్గర గతేడాది 410 ఉండగా, ఇప్పుడది 500కు చేరింది. యుద్ధాల కారణంగా ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, రాజకీయ దౌత్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో అణ్వస్త్రాల పాత్ర ప్రముఖంగా మారిందని ‘సిప్రి’ రిపోర్ట్‌ పేర్కొన్నది.

అణ్వాయుధాలతో పాటు ఆయుధాలు కూడా ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేవే. ప్రపంచంలో ఆయుధాలు ఎగుమతి చేస్తున్న దేశాలలో అమెరికా అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇక ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాలలో భారత్‌ మొదటి స్థానంలో ఉన్నది. భారత్‌ అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా రష్యా కొనసాగుతున్నది. భారత దిగుమతులలో రష్యా వాటా 36 శాతం. ఆయుధాల దిగుమతుల్లో మొదటి ఐదు స్థానాల్లో ఇండియా, సౌదీ అరేబియా, ఖతార్, ఉక్రెయిన్, పాకిస్తాన్‌ ఉన్నాయి. రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయిల్‌–పాలస్తీనా యుద్ధాలు కొనసాగుతున్న వేళ అణ్వాయుధాల భయం మళ్లీ పెరిగింది. ఆయా దేశాలు రక్షణ పేరుతో ఆయుధాలు పెంచుకుంటూ పోవడం ఆయుధ పోటీకి దారి తీస్తున్నది. – నర్సింగు కోటయ్య, మిర్యాలగూడ

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)