Breaking News

డాలర్‌ వెలవెల... బంగారం ధగధగ

Published on Thu, 06/19/2025 - 00:33

బంగారం ఒక విలువైన లోహం. భారతదేశం వంటి దేశాలలో అది మహిళలకు ఇష్టమైన అలంకారం.లేకుంటే, ధనవంతులకు తమ సంపదను దాచుకునే ఒక మార్గం. కానీ ఇదే బంగారం 1971 ఆగస్టు 15 వరకూ అమెరికా డాలర్‌కు విలువను  కల్పించిన సాధనం. 

నాటి వరకూ, అమెరికా డాలర్‌  అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలకు అవసరమైన రిజర్వ్‌ కరెన్సీగా కొనసాగగలిగేటందుకు, ఈ డాలర్‌ – బంగారం లింక్‌ ఉపయోగపడింది. అయితే, నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ ఈ లింక్‌ను తెగ్గొట్టేశాడు. అంటే, ఇక ముందర తాము ముద్రిస్తోన్న డాలర్‌లకు ఆ మేరకు, వెనుక తట్టున బంగారాన్ని నిల్వ పెట్టబో మని తేల్చి చెప్పేశాడు. 

ఈ రకంగా డాలర్‌ అనేది ఫ్లోటింగ్‌ కరెన్సీగా మారింది. అంటే, బంగారం లింక్‌ తెగిపోయిన తర్వాత డాలర్‌ తాలూకు విలువ, ఇతర దేశాల కరెన్సీ లతో పోలిస్తే, దానికున్న డిమాండ్‌పై ఆధారపడ సాగింది. ఇదే క్రమంలో, ప్రపంచంలోని అనేక కరెన్సీలు మెల్లమెల్లగా ఫ్లోటింగ్‌ కరెన్సీలుగా మారాయి. 

ఒక దేశం వివిధ దేశాలతో చేసిన వ్యాపారం తదితర లావాదేవీల ఫలితంగా సమకూరిన అనేక దేశాల కరెన్సీలతో పాటుగా... వాటిలో ఒకటిగా, కొద్దిపా టిగా బంగారం నిల్వలను కూడా  వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు (మన రిజర్వ్‌ బ్యాంక్‌ వంటివి) తమ కిట్టీలో అట్టిపెట్టుకోసాగాయి. కాగా, ఈ కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న వివిధ కరెన్సీల నిల్వలు అన్నింటిలోనూ డాలర్‌దే తిరుగులేని పై చేయిగా ఉంటూ వస్తోంది. 

కానీ, ఇటీవల మరలా కథ తిరగబడుతోంది. వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న మారకం నిల్వలలో యూరో కరెన్సీని అధిగమించి డాలర్‌ తరు వాతి స్థానంలోకి బంగారం నిల్వలు చేరుకుంటు న్నాయి. అంటే, డాలర్‌ యుగం ముగుస్తోందన్న మాట. 

కానీ దానికి తక్షణ ప్రత్యామ్నాయం కనపడని ఈ సంధి దశలో, బంగారం తిరిగి ప్రాభవంలోకి వస్తోంది. దీనికి తార్కాణమే నేడు కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వల స్థాయి సుమారుగా 36 వేల టన్నులకు చేరుకోవడం. గతంలో ఈ స్థాయిలో అవి ఉన్నది 60 సంవత్సరాల క్రితం మాత్రమే! 

1971లోనే బంగారంతో లింక్‌ తెగిపోయినా... నేటి వరకూ కూడా డాలర్‌ తన అంతర్జాతీయ రిజర్వ్‌ కరెన్సీ స్థానాన్ని పదిలంగా అట్టిపెట్టుకోగల్గింది. 

అయితే 1980ల నుంచీ, ఔట్‌సోర్సింగ్‌ రూపంలో అమెరికా పరిశ్రమలు చైనా వంటి ఇతర చవక శ్రమ శక్తి దేశాలకు తరలిపోవడం, 1990ల మధ్య నుంచీ, ఇంటర్నెట్‌ సాంకేతికత వలన అమెరికాలోని సేవా రంగం కూడా పెద్ద ఎత్తున భారతదేశం వంటి దేశాలకు తరలి వెళ్ళిపోవడం; యాంత్రీకరణ వేగం పెరిగి అమెరికాలో ప్రజలకు ఉపాధి అవకాశాలు తగ్గి పోవడం... ఫలితంగా వారి కొనుగోలు శక్తి పడిపోయే పరిస్థితులు వచ్చాయి. 

ఈ క్రమంలోనే అమెరికా భారీ ఎత్తున ఇతర దేశాల దగ్గర అప్పులు చేయసాగింది. అంతిమంగా నేడు ఈ అప్పు స్థాయి సుమారుగా 35 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.  

అమెరికా పాలకులు తమ ప్రజల కొనుగోలు శక్తిని కాపాడే ప్రయత్నంలో భాగంగా 2008 ఆర్థిక సంక్షోభ సమయంలో, 2020 కోవిడ్‌ లాక్‌డౌన్‌ కాలంలో ఉద్దీపన పథకాల కోసం పెద్ద ఎత్తున లక్షల కోట్ల డాలర్లను ముద్రించారు. అంతకు ముందర అనేక దశాబ్దాలుగా కూడా అమెరికాలో డాలర్ల ముద్రణ శ్రుతి మించి జరిగింది. ఈ క్రమంలోనే డాలర్‌ కరెన్సీ తన విలువను కోల్పోసాగింది. 2022 అనంతరం, ఆ దేశంలో విజృంభించిన  ద్రవ్యోల్బణం లేదా ధరల పెరుగుదల అనేవి  దశాబ్దాల పాటు జరి గిన డాలర్‌ల అపరిమిత ముద్రణ ఫలితమే.

ఈ క్రమంలోనే, బలహీనపడుతోన్న డాలర్‌ రూపంలో తమ తమ విదేశీ మారకద్రవ్య నిల్వలను అట్టిపెట్టుకోవడం కంటే, బంగారం వంటి నికరంగా విలువను నిలబెట్టుకోగల ప్రత్యామ్నాయాన్ని ఆశ్ర యించడం మేలని కేంద్ర బ్యాంకులు నిర్ణయించుకుంటున్నాయి. దీనంతటితో పాటుగా, రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ క్రమంలో, అమెరికా ప్రభుత్వం రష్యాపై అనేక ఆంక్షలు విధించింది. 

ఈ ఆంక్షలలో భాగంగా అమె రికా డాలర్‌ కరెన్సీ లావాదేవీల వ్యవస్థ నుంచి, రష్యాను బయటకు నెట్టివేసింది. ఈ బహిష్కరణ అనేది  ప్రపంచంలోని చాలా దేశాలకు డాలర్‌పై ఆధారపడడం తాలూకు అభద్రతను బోధపరిచింది. ఫలితంగా, నేడు పలు దేశాలు డాలర్‌పై ఆధారపడ డాన్ని తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అవి బంగారం దిశగా కూడా మళ్ళుతున్నాయి.

గత 15 ఏళ్లుగా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు భారీ ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. 2024లో ఇవి రికార్డు స్థాయిలో 1,180 టన్నుల బంగా రాన్ని కొనుగోలు చేశాయి. కేంద్ర బ్యాంకుల కిట్టీలో బంగారం నిల్వల స్థాయి పెరుగుతూ రావడం అనేది... పాత డాలర్‌ యుగం ఆధిపత్య స్థానంలో మరో సరికొత్త కరెన్సీ లేదా కరెన్సీల సమూహం వచ్చి చేరే వరకూ నడిచే సంధి యుగం లక్షణమే.

డి. పాపారావు 
వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులు
మొబైల్‌: 98661 79615

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)