Breaking News

ఉద్యమ వాస్తవ చరిత్ర..

Published on Sat, 06/08/2024 - 10:46

ప్రపంచీకరణ అనంతరం వ్యక్తివాదం పెరిగి పోయి ఉద్యమాలు ఉండవు అనే ప్రచారం బలంగా నడుస్తున్న కాలంలో ప్రాంతీయ అస్తిత్వ వేదనలోంచి ఎగిసిన విముక్తి పోరాటం తెలంగాణ ఉద్యమం. పల్లెల నుండి పట్టణాల దాకా తెలంగాణ అనని మనిషి లేడు. కులాలు, మతాలకతీతంగా అందరూ ఒక్క గొంతుకగా నినదించిన నినాదం ‘జై తెలంగాణ’. అందులో ముఖ్య భూమిక విద్యార్థులది. 

మంటలై మండింది, రైళ్ళకు ఎదురెళ్లి ముక్కలైంది, ఉరిపోసుకున్నది, పురుగుల మందు తాగింది. ఏది చేసినా తెలంగాణ అనే ఉద్యమ కాగడను ఆరిపోకుండా చమురు పోసి మండించేందుకే. పాలకులు, ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులు ఉద్యమానికి ద్రోహం చేసినప్పుడు మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది విద్యార్థులే.

విద్యార్థులు ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం వెనుక స్వాతంత్య్ర ఉద్యమం, రైతాంగ సాయుధ పోరాటం, తొలిదశ తెలంగాణ ఉద్యమం, నక్సల్బరీ పోరాటాల స్పూర్తి, ప్రభా వాలు ఉన్నాయి. ఆ చైతన్యమే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసింది. అట్లా ఎగిసిన విద్యార్థి ఉద్యమం రాజకీయ పార్టీల కనుసన్నల్లోకి ఎలా పోయింది? దానికి పని చేసిన శక్తులేవి? తెలంగాణ ఉద్యమం ఏకశిలా సదృశ్యం అనుకుంటున్న చోట నిలబడిన, కలబడిన, వెనక్కి తగ్గిన శక్తులను బహిర్గత పరచిన పరిశోధన ఈ పుస్తకం. ఒక్కమాటలో, కళ్ళముందే వక్రీకరణలకు గురవుతున్న తెలంగాణ ఉద్యమ వాస్తవ చరిత్ర ఇది. ఈ పరిశోధన తెలంగాణ ఉద్యమకారుడే (నలమాస కృష్ణ) పరిశోధకుడిగా చేసిన ప్రయత్నం.

ఇది అకడమిక్‌ పరిశోధన కాబట్టి దీనికి పరిమితులు ఉన్నా... ఇది ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని సమగ్రంగా నమోదు చేసిందని మాత్రం చెప్పవచ్చు. అలా భవిష్యత్తు పరిశోధనకు దారులు వేసిందన్నమాట. ఉద్యమం నడుస్తుండగానే తీరికలేని కార్యాచరణలో దాని తీరూ తెన్నులపై చేసిన ఓ విశ్లేషణ ఇది. ఆ పరిమితుల్లో దీన్ని అర్థం చేసుకుంటూ అధ్యయం చేయాల్సి ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజ్‌ ప్రాంగణంలో జరుగనున్న ఈ పుస్తకావిష్కరణకు అందరూ ఆహ్వానితులే. – అరుణాంక్, డేవిడ్‌ (నేడు హైదరాబాద్‌లో ‘ఉస్మానియా వెలుగులో తెలంగాణ విద్యార్థి ఉద్యమం’ పుస్తకావిష్కరణ)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)